33రోజుల్లో మల్లన్న ఆదాయం రూ.1.90కోట్లు | Srisailam temple nets record collection of RS. 1.90 crore | Sakshi
Sakshi News home page

33రోజుల్లో మల్లన్న ఆదాయం రూ.1.90కోట్లు

Published Tue, Oct 6 2015 6:38 PM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM

శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్ల ఉభయ దేవాలయాలలో మంగళవారం భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 1,90,61,638 లభించినట్లు ఈవో సాగర్‌బాబు తెలిపారు.

శ్రీశైలం (కర్నూలు) : శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్ల ఉభయ దేవాలయాలలో మంగళవారం భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 1,90,61,638 లభించినట్లు ఈవో సాగర్‌బాబు తెలిపారు. నిత్య కల్యాణ మండపంలో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారని అన్నారు. నగదుతో పాటు 115 గ్రాముల బంగారు, 4 కేజీల 850 గ్రాముల వెండి లభించిందన్నారు.

అలాగే, విదేశీ కరెన్సీ 2314 యూఎస్‌ఏ డాలర్లు, 10 కెనడా డాలర్లు, 2 సింగపూర్ డాలర్లు, 1 కువైట్ దినార్, 35 యూఏఈ దిర్హమ్స్, 9 మలేషియా రింగిట్స్, 2 సౌదీరియాల్స్ హుండీల ద్వారా వచ్చాయన్నారు. ఈ మొత్తం స్వామి అమ్మవార్లకు 33 రోజులలో వచ్చిన ఆదాయంగా ఈవో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement