కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ విజయం సాధించింది. అలాగే అత్యధిక ఓటింగ్ శాతంతో మాత్రమే కాదు.. ఒక పార్టీకి విజయం దక్కడంలోనూ అక్కడ సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. 34 ఏళ్ల తర్వాత.. ఒక పార్టీ ఇంతేసి ఓటు షేర్, ఇన్నేసి స్థానాలతోనూ గెలుపొందడం ఈ ఎన్నికల్లోనే జరిగింది.
► 1994లో 115 స్థానాలు గెలుపొందిన జేడీఎస్ మొత్తం ఓటింగ్‌లో 33.54 శాతం ఓటు షేర్ దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా హెచ్‌డీ దేవగౌడ ప్రమాణం చేశారు.
► 1999 ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ 132 స్థానాలు కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో 40.84 శాతం ఓట్ షేర్ దక్కించుకుంది. ఎంఎం కృష్ణను ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్.
► 2004 ఎన్నికల్లో.. 79 స్థానాలు నెగ్గిన బీజేపీ.. కేవలం 28.33 శాతం ఓట్ షేర్‌ను దక్కించుకుంది. యాడియూరప్పను సీఎంను చేసింది.
► 2008లో 110 స్థానాలు గెలుపొందిన బీజేపీ.. 33.86 శాతం ఓట్ షేర్‌ను దక్కించుకుంది. మళ్లీ యడియూరప్పనే సీఎంను చేసింది.
► 2013 అసెంబ్లీ ఎన్నికల్లో.. 122 స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్.. 36.6 శాతం ఓటు షేర్‌ను దక్కించుకుంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేసింది.
► 2018 ఎన్నికల్లో.. 104 స్థానాలు, 36.3 శాతం ఓటు షేర్ దక్కించుకుంది బీజేపీ. యాడియూరప్పను సీఎంను చేసింది.
► 2023 ఎన్నికల్లో.. 136 స్థానాలు, 43 శాతం ఓటింగ్‌తో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. గత ఎన్నికల్లో కంటే ఏకంగా ఐదు శాతం ఓటింగ్‌ను పెంచుకుంది కాంగ్రెస్.
ఇక గతంలో.. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ 178 స్థానాలు దక్కించుకుని.. 43.76 శాతం ఓటు షేర్‌ను కైవసం చేసుకుంది. వీరేంద్ర పాటిల్‌ను అప్పుడు సీఎంను చేసింది.
Comments
Please login to add a commentAdd a comment