UPI Transactions Cross 10 Billion Mark: దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపుల్లో మళ్లీ రికార్డ్ నమోదైంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు వరుసగా రెండో సారి 10 బిలియన్ లావాదేవీల మార్క్‌ను దాటాయి. గడిచిన ఆగస్టు నెలలో యూపీఐ లావాదేవీలు మొదటిసారిగా 10 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. మళ్లీ సెప్టెంబర్ నెలలో రెండో సారి 10 బిలియన్ లావాదేదీలు జరిగాయి.
సెప్టెంబర్ 30 వరకు 10.55 బిలియన్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 'X' (ట్విటర్)లో పేర్కొంది. చెల్లింపు వ్యవస్థల గణాంకాలను షేర్ చేసింది. అయితే ఆగస్టులో నమోదైన 10.58 బిలియన్ల లావాదేవీలతో పోల్చితే సెప్టెంబర్‌లో జరిగిన లావాదేవీలు కాస్త తక్కవగా ఉన్నాయి. కానీ ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన 6.78 బిలియన్ల లావాదేవీలతో పోలిస్తే 55 శాతం పెరిగాయి.
రూ. 15.79 లక్షల కోట్లు
యూపీఐ లావాదేవీల మొత్తం విలువను పరిశీలిస్తే ఆగస్టు నెలలో రూ. 15.76 లక్షల కోట్ల నుంచి సెప్టెంబర్‌లో రూ. 15.79 లక్షల కోట్లకు చేరింది. 2022 సెప్టెంబర్‌లో జరిగిన లావాదేవీల విలువ రూ. 11.16 లక్షల కోట్లు. వరల్డ్‌లైన్ డేటా ప్రకారం.. యూపీఐ లావాదేవీల సంఖ్య 2018 జనవరిలో 151 మిలియన్లు ఉండగా 2023 జూన్ నాటికి 9.3 బిలియన్లకు చేరుకుంది.
30th SEPTEMBER 2023: DAILY PAYMENTS STATISTICS #BHIMUPI #IMPS #NETC pic.twitter.com/hvh1UyEjMe
— NPCI (@NPCI_NPCI) October 1, 2023
Comments
Please login to add a commentAdd a comment