లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ టెస్ట్‌ల్లో 11000 పరుగుల మైలురాయిని తాకాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లండ్ క్రికెటర్‌గా.. ఓవరాల్‌గా 11వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో రూట్ మరో రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంగ్లండ్ తరఫున వేగవంతంగా 11000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాడిగా, అలిస్టర్ కుక్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మైలురాయిని చేరుకునేందుకు కుక్‌కు 252 ఇన్నింగ్స్‌లు అవసరమైతే.. రూట్ 232 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ 11000 రన్స్ రికార్డు కుమార సంగక్కర (208 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది.
కాగా, ఫాబ్ ఫోర్‌గా చెప్పుకునే (రూట్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్) ప్రస్తుత తరం స్టార్ క్రికెటర్లలో పరుగుల పరంగా ఎవరూ రూట్‌కు దరిదాపుల్లో కూడా లేరు. 32 ఏళ్ల రూట్ 130 టెస్ట్‌ల్లో 11000 పరుగుల మైలురాయిని తాకితే.. 34 ఏళ్ల స్టీవ్ స్మిత్ 96 టెస్ట్‌ల్లో 8792 పరుగులు, 34 ఏళ్ల విరాట్ కోహ్లి (34) 108 టెస్ట్‌ల్లో 8416 పరుగులు, 32 ఏళ్ల కేన్ విలియమ్సన్ 94 టెస్ట్‌ల్లో 8124 పరుగులతో చాలా వెనుకపడి ఉన్నారు. వయసు పరంగా చూసినా ఫాబ్ ఫోర్‌లో మిగతా ముగ్గురితో పోలిస్తే రూట్‌కు టెస్ట్‌ల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (15921) బద్దలు కొట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రెండో రోజు టీ విరామం సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బెన్ డకెట్ (182) భారీ సెంచరీతో అలరించి ఔట్ కాగా.. ఓలీ పోప్ (197 నాటౌట్) ద్విశతకానికి 3 పరుగుల దూరంలో ఉన్నాడు. అతనికి జతగా రూట్(52 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
చదవండి: ఆఫ్ఘనిస్తాన్ సంచలనం.. తమ కంటే మెరుగైన జట్టుపై ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment