మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. జనవరి 7వ తేదీన సిడ్నీలో మూడో టెస్టు ఆరంభం కానుండగా, అటు తర్వాత జనవరి 15వ తేదీ నుంచి బ్రిస్బేన్ వేదికగా చివరి టెస్టు జరుగనుంది. అయితే ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) విధించే ఆంక్షలతో టీమిండియా నాల్గో టెస్టు ఆడలేమని అంటోంది. క్వీన్‌లాండ్స్ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో మ్యాచ్‌ను ఇక్కడే నిర్వహించినా కఠినమైన ఆంక్షలు అమలు చేయాలని సీఏ చూస్తోంది. అయితే దీనికి టీమిండియా ససేమేరా అంటోంది. ఒక్క మ్యాచ్ కోసం కఠినమైన ఆంక్షలు అమలు చేయాల్సిన అవసరం లేదని, మూడో టెస్టు జరిగే సిడ్నీలోనే నాల్గో టెస్టు కూడా నిర్వహిస్తే బాగుంటుందని సూత్రప్రాయంగా సూచించింది. అయితే దీనికి ఆసీస్ ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా నాల్గోటెస్టును వాకౌట్ చేస్తామని హెచ్చరించింది. కఠినమైన ఆంక్షలు విధిస్తే ఆ టెస్టు ఆడబోమనే సంకేతాలు పంపింది. (రోహిత్ బీఫ్ ఆర్డర్ చేశాడా.. హిట్‌మ్యాన్‌పై ట్రోలింగ్!)
దీనిపై ఆసీస్ మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్బేన్‌లో ఎలాగూ గెలవలేమనే సాకుతోనే వాకౌట్ చేస్తామంటున్నారా అంటూ టీమిండియాపై ఆరోపణలు చేశాడు. ఫాక్స్ క్రికెట్‌తో హాడిన్ మాట్లాడుతూ.. ‘ ఒక క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే.. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియానికి భారత్ ఎందుకు వెళ్లాలని అనుకుంటుంది. ఇక్కడ ఆస్ట్రేలియానే ఫేవరెట్. ఆ విషయం టీమిండియాకు తెలుసు. ఇక్కడ సుదీర్ఘ కాలంగా ఆసీస్‌దే పైచేయి. వేరే జట్టులు ఇక్కడ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. టీమిండియా క్రికెటర్లు ఎప్పట్నుఉంచో బయో బబుల్ నిబంధనల్ని పాటిస్తూ వస్తున్నారు. అటువంటప్పుడు చివరి టెస్టుకు నిబంధనలు పాటిస్తే తప్పేముంది. ఇది నాకు తెలిసినంతవరకూ ఒక సాకు మాత్రమే’ అంటూ హాడిన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment