బ్రాడ్ హడిన్(File Photo)
ఐపీఎల్-2023కు ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్‌ను తమ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా పంజాబ్ కింగ్స్ నియమించింది. కాగా గత నెలలో ట్రెవర్ బేలిస్‌ను జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా పంజాబ్ నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పడు బేలిస్‌తో కలిసి హాడిన్ పనిచేయనున్నాడు.
కాగా గతంలో వీరిద్దరూ కలిసి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాప్‌గా పనిచేశారు. "హాడిన్‌ను పంజాబ్ కింగ్స్ తమ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక చేసింది. త్వరలోనే మిగిలిన సహాయక సిబ్బందిని నియమిస్తుంది" ఐపీఎల్ వర్గాలు గురువారం వెల్లడించాయి.
ఇక హాడిన్ ఆస్ట్రేలియా తరపున 66 టెస్టులు, 126 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ నిరాశపరిచింది. ఐపీఎల్-2023లో 14 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
చదవండి: T20 WC NAM VS UAE: కంటతడి పెట్టిన డేవిడ్ వీస్.. అద్భుత పోరాటం అంటూ నెటిజన్ల కితాబు
Comments
Please login to add a commentAdd a comment