
భార్యా పిల్లలతో హాడిన్
సిడ్నీ: ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ కాలం జట్టును అంటిపెట్టుకుని ఉన్న 37 ఏళ్ల హాడిన్ టెస్టు క్రికెట్ నుంచి వైదొలగుతున్న్టట్టు బుధవారం ప్రకటించాడు. సిడ్నీ సిక్సర్స్ తరపున టి20లు మాత్రమే ఆడతానని వెల్లడించాడు. గత మే నెలలోనే వన్డే క్రికెట్ కు అతడు గుడ్ బై చెప్పాడు.
'లార్డ్స్ నుంచి తిరిగివచ్చాక రియల్ లైజ్ అయ్యాను. బ్యాట్స్ మన్ గా పరుగులు చేయడం నా బాధ్యత. కానీ యాషెన్ సిరీస్ లో విఫలమయ్యాను. ఫలితంగా రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా' అని హాడిన్ తెలిపాడు.
66 టెస్టులు ఆడిన హాడిన్ కు గిల్ క్రిస్ట్ రిటైర్మెంట్ తర్వాత 30 ఏళ్ల వయసులో తొలి టెస్ట్ ఆడే అవకాశం దక్కింది. టెస్టుల్లో అతడు 270 వికెట్లు పడగొట్టాడు. 32.98 సగటుతో 3266 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు,18 అర్ధసెంచరీలు ఉన్నాయి.