Test Cricket Career
-
మామూలుగా తిప్పలేదు!
-
మామూలుగా తిప్పలేదు!
ఇండోర్: న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటాడు. తన స్పిన్ మాయాజాలంతో కివీస్ బ్యాట్స్ మెన్లను గింగిరాలు తిప్పాడు. ఈ సిరీస్ లో మొత్తం 27 వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు. చివరి టెస్టులో 13 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు నేలకూల్చి, రెండు రనౌట్లలో పాలుపంచుకున్న ఈ నంబర్ ఆల్ రౌండర్ రెండో ఇన్నింగ్స్ లోనూ అదేస్థాయిలో విజృంభించాడు. 13.5 ఓవర్లలో 59 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో రెండు మేడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. కాన్పూర్ లో జరిగిన తొలి టెస్టులో మొదటి టెస్టులో(4, 6) మొత్తం 10 వికెట్లు తీశాడు. కోల్ కతాలో జరిగిన రెండో టెస్టులో నాలుగు వికెట్లు నేలకూల్చాడు. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు. ఇప్పటివరకు 39 టెస్టులు ఆడిన అశ్విన్ 220 వికెట్లు తీశాడు. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం అశ్విన్ రెండో ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. -
టి20 మాత్రమే ఆడతా: హాడిన్
సిడ్నీ: ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ కాలం జట్టును అంటిపెట్టుకుని ఉన్న 37 ఏళ్ల హాడిన్ టెస్టు క్రికెట్ నుంచి వైదొలగుతున్న్టట్టు బుధవారం ప్రకటించాడు. సిడ్నీ సిక్సర్స్ తరపున టి20లు మాత్రమే ఆడతానని వెల్లడించాడు. గత మే నెలలోనే వన్డే క్రికెట్ కు అతడు గుడ్ బై చెప్పాడు. 'లార్డ్స్ నుంచి తిరిగివచ్చాక రియల్ లైజ్ అయ్యాను. బ్యాట్స్ మన్ గా పరుగులు చేయడం నా బాధ్యత. కానీ యాషెన్ సిరీస్ లో విఫలమయ్యాను. ఫలితంగా రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా' అని హాడిన్ తెలిపాడు. 66 టెస్టులు ఆడిన హాడిన్ కు గిల్ క్రిస్ట్ రిటైర్మెంట్ తర్వాత 30 ఏళ్ల వయసులో తొలి టెస్ట్ ఆడే అవకాశం దక్కింది. టెస్టుల్లో అతడు 270 వికెట్లు పడగొట్టాడు. 32.98 సగటుతో 3266 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు,18 అర్ధసెంచరీలు ఉన్నాయి. -
సంగక్కర స్పెషల్!
కొలంబో: క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో శ్రీలంక బ్యాట్స్ మన్ కుమార్ సంగక్కర్ రెండో స్థానంలో నిలిచాడు. మూడు ఫార్మాట్లలో(టెస్టులు, వన్డేలు, టి20) ఇప్పటివరకు అతడు 27,966 పరుగులు చేశాడు. భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సంగక్కర కొలంబోలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ తర్వాత క్రికెట్ జీవితానికి వీడ్కోలు చెబుతానని సంగక్కర ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 133 టెస్టులు ఆడిన సంగక్కర 12,350 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సంగక్కర ఐదో స్థానంలో ఉన్నాడు. 85 టెస్టుల్లో అతడు వికెట్ కీపింగ్ చేయలేదు. ఈ మ్యాచుల్లో 67.4 సగటుతో 9,233 పరుగులు సాధించడం విశేషం. 11 డబుల్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. బ్రాడ్ మన్(12) టాప్ లో ఉన్నాడు. సంగక్కర ఖాతాలో 38 టెస్టు సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో వేగంగా 8, 9, 11, 12 వేల పరుగులు పూర్తి చేసిన ఘనత కూడా సంగక్కర పేరిట ఉంది. టెస్టుల్లో సంగక్కర బౌలింగ్ కూడా చేశాడు. నాలుగు ఇన్నింగ్స్ లో 4 బంతులు విసిరిన అతడు ఒక వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. 404 వన్డేలు ఆడిన సంగక్కర 41.98 సగటుతో 14234 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 93 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు.