
మామూలుగా తిప్పలేదు!
ఇండోర్: న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటాడు. తన స్పిన్ మాయాజాలంతో కివీస్ బ్యాట్స్ మెన్లను గింగిరాలు తిప్పాడు. ఈ సిరీస్ లో మొత్తం 27 వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు. చివరి టెస్టులో 13 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు నేలకూల్చి, రెండు రనౌట్లలో పాలుపంచుకున్న ఈ నంబర్ ఆల్ రౌండర్ రెండో ఇన్నింగ్స్ లోనూ అదేస్థాయిలో విజృంభించాడు. 13.5 ఓవర్లలో 59 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో రెండు మేడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి.
కాన్పూర్ లో జరిగిన తొలి టెస్టులో మొదటి టెస్టులో(4, 6) మొత్తం 10 వికెట్లు తీశాడు. కోల్ కతాలో జరిగిన రెండో టెస్టులో నాలుగు వికెట్లు నేలకూల్చాడు. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు.
ఇప్పటివరకు 39 టెస్టులు ఆడిన అశ్విన్ 220 వికెట్లు తీశాడు. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం అశ్విన్ రెండో ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.