టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. 2023 ఏడాదికిగాను ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సూర్య భాయ్ ఎంపికయ్యాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును సూర్య అందుకోవడం వరుసగా రెండో సారి కావడం విశేషం. తద్వారా టీ20 ఫార్మాట్‌లో ఈ అవార్డును రెండు సార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా మిస్టర్ 360 నిలిచాడు.
ఇక ఈ అవార్డు కోసం సూర్యతో పాటు సికందర్ రజా (జింబాబ్వే), అల్పేష్ రమ్‌జాని (ఉగాండా), మార్క్ చాప్‌మన్ (న్యూజిలాండ్) అవార్డు కోసం పోటీపడ్డారు. కానీ వీళ్లందరిలో సూర్య వైపే ఐసీసీ మొగ్గు చూపింది. 2023 ఏడాదిలో సూర్యకుమార్ 17 ఇన్నింగ్స్‌లో 48 సగటుతో 733 పరుగులు చేశాడు.
అతడి ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు ఉన్నాయి. కాగా అంతకుముందు 2022 ఏడాదిలోనూ ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సూర్యకుమార్ నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ అవార్డును ఐసీసీ 2021 నుంచి బహుకరిస్తుంది. 2021లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ అందుకున్నాడు.
మరోవైపు 2023 ఏడాదికి గాను ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టుకు సూర్యనే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో భారత్ నుంచి యశస్వి జైస్వాల్, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. ఇక సూర్య ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్-2024 సమయానికి అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment