టీమిండియాతో మ్యాచ్‌.. పాక్‌ బౌలర్‌ ఓవరాక్షన్‌! వీడియో వైరల్‌ | Pakistan pacer gives aggressive send off to Rudra Patel in IND U19 vs PAK U19 match | Sakshi
Sakshi News home page

Asia cup 2023: టీమిండియాతో మ్యాచ్‌.. పాక్‌ బౌలర్‌ ఓవరాక్షన్‌! వీడియో వైరల్‌

Published Sun, Dec 10 2023 6:51 PM | Last Updated on Mon, Dec 11 2023 9:28 AM

Pakistan pacer gives aggressive send off to Rudra Patel in IND U19 vs PAK U19 match - Sakshi

వరల్డ్‌క్రికెట్‌లో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడతాయా అని ఇరు దేశాల అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో అండర్‌-19 ఆసియాకప్‌-2023లో భాగంగా దుబాయ్‌ వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బౌలర్‌ మహ్మద్ జీషన్ ఓవరాక్షన్‌ చేశాడు.

ఏం జరిగిదంటే?
భారత్‌ ఇన్నింగ్స్‌ 12 ఓవర్‌ వేసిన జీషన్ బౌలింగ్‌లోమొదటి బంతిని భారత బ్యాటర్‌ రుద్ర పటేల్ మిడాన్‌ దిశగా షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ చేతికి వేళ్లాడు. కీలక వికెట్ తీయడంతో  పాక్ పేసర్ గాల్లోకి ఎగురుతూ సంబరాలు జరుపుకున్నాడు. ఈ క్రమంలో అతడి సెలబ్రేషన్స్‌ శృతిమించాయి.

బ్యాటర్‌ దగ్గర వెళ్లి తన వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ జీషన్ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన టీమిండియా అభిమానులు మరి అంత ఓవరాక్షన్‌ పనికిరాదుంటా కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement