అండర్-19 ప్రపంచ కప్‌ను భారత్‌కు అందించిన కెప్టెన్ యష్ ధుల్ రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు ఆడనున్నాడు. మరో వైపు ఇషాంత్ శర్మ ఢిల్లీ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇషాంత్ శర్మ తన నిర్ణయాన్ని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీకి తెలియజేశాడు. ఇక యష్ ధుల్ ఫిబ్రవరి 10న గౌహతికి చేరుకుంటాడు. అక్కడ 5 రోజుల క్వారంటైన్‌లో యష్ ఉండనున్నాడు. యష్ ధుల్ తో సహా జట్టు మొత్తం అహ్మదాబాద్‌లో ఉన్నారు.
భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేను వీక్షించారు. అదే విధంగా ప్రపంచకప్ గెలిచిన అండర్-19 జట్టును బీసీసీఐ సత్కరించింది. ఇక రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు ప్రదీప్ సాంగ్వాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. "అతడి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. చాలా రెడ్ బాల్ మ్యాచ్‌లు ఆడకపోయినా, అతడు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాని" డీడీసీఏ సెలెక్టర్ పేర్కొన్నాడు.
జట్టు: ప్రదీప్ సాంగ్వాన్, నితీష్ రాణా, ధృవ్ షోరే, ప్రియాంష్ ఆర్య, యశ్ ధుల్, క్షితిజ్ శర్మ, జాంటీ సిద్ధు, హిమ్మత్ సింగ్, లలిత్ యాదవ్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), లక్షయ్ థరేజా, నవదీప్ సైనీ, సిమర్జిత్ సింగ్, మయాంక్ యాదవ్, కె. మిశ్రా, శివంగ్ వశిస్ట్, శివం శర్మ
చదవండి: 'కోహ్లి నుంచి తొలి క్యాప్ అందుకోవాలనేది నా చిన్ననాటి కల'
Comments
Please login to add a commentAdd a comment