క్రికెట్‌ను ఒక మతంగా భావించే భారత్‌లో రంజీ ట్రోఫీకి దాదాపు శతాబ్దం చరిత్ర ఉంది. ఏ క్రికెటర్ అయినా తన ఆటను మొదలుపెట్టాలంటే ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాల్సిందే. ఐపీఎల్ రాకముందు రంజీ ట్రోఫీలాంటి దేశవాలీ టోర్నీల్లో ప్రతిభ ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేసేవారు. మరి అంతటి చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీ పుట్టుక ఎలా జరిగిందనేది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
టీమిండియా క్రికెట్‌లో ఎంతో చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీని 1934వ సంవత్సరంలో తొలిసారి ప్రారంభించారు. అప్పటి పాటియాల మహారాజైనా భూపిందర్ రంజీ ట్రోఫీకు నాంది పలికాడు. ఇక మొదటి రంజీ మ్యాచ్ 1934వ సంవత్సరం నవంబర్ 4 తేదీన చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడారు. మొట్టమొదటి రంజీ మ్యాచ్ చెన్నై ,మైసూర్ జట్ల మధ్య జరిగింది. ఇక అప్పటినుండి రంజీ ట్రోఫీను క్రమం తప్పకుండా ప్రతి ఏడాది నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే కోవిడ్ కారణంగా 2020-21 రంజీ సీజన్ ను పూర్తిగా రద్దు చేశారు. ఆ ఒక ఏడాది తప్పిస్తే ఇప్పటివరకు ఈ రంజీ ట్రోఫీ చరిత్ర అనేది మొత్తం 87 సార్లు జరిగింది.
ఇక ఈ టోర్నీకి ''రంజీ'' అనే పేరు ఎలా వచ్చిదంటే.. నవనగర్ ప్రిన్స్ అయినా రంజిత్ సింహ్జి భారత్‌లోనే పుట్టాడు. దేశం నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మొట్టమొదటి ప్లేయర్‌గా రంజిత్ గుర్తింపు పొందాడు. ఇండియా తరపున ఆడమని అభ్యర్థన చేసినప్పటికి మాటను ఖాతరు చేయడకుండా రంజిత్ తన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఇంగ్లండ్ లోనే ఆడాడు. కానీ ఇండియా నుంచి వెళ్లి అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు కాబట్టి అతని గుర్తుగా ఈ టోర్నమెంట్కు రంజీ ట్రోఫీ అని పేరు పెట్టారు.
నిజానికి అతను అప్పట్లో బ్రిటిష్ అండర్లో ఉన్న రాజు కాబట్టి తన పేరు పెట్టవలసి వచ్చింది. అదే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ టోర్నీ ప్రారంభం అయి ఉంటే మాత్రం మన ఇండియా తరపున క్రికెట్ ఆడిన ఎవరో ఒక దిగ్గజ ఆటగాడి పేరు పెట్టేవారేమో. అలా రంజిత్ ఇంగ్లండ్ తరపున 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 989 పరుగులు సాధించాడు.
ఇప్పటివరకు 87 సార్లు జరిగిన ఈ రంజీ ట్రోఫీను ముంబై జట్టు ఏకంగా 41 సార్లు గెలుచుకుంది. మరే ఇతర జట్టు కనీసం పది సార్లు కూడా ఈ ట్రోఫీను గెలవలేకపోయారు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు రంజీ ట్రోఫీలో ముంబై జట్టు ఆధిపత్యం ఎంతలా ఉందనేది. అంతేకాదు ముంబై జట్టు 1958 నుంచి 1972 వరకు వరుసగా 15 సార్లు రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచి ఏ జట్టుకు సాధ్యం కానీ అరుదైన రికార్డును నెలకొల్పింది. ఇక ముంబై తరువాత కర్ణాటక జట్టు ఎనిమిదిసార్లు రంజీ ట్రోఫీ గెలిస్తే.. ఢిల్లీ జట్టు ఏడు సార్లు రంజీ విజేతగా నిలిచింది.
మధ్యప్రదేశ్ జట్టు ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఛాంపియన్స్గా ఉంది. మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ గెలవడం ఇదే తొలిసారి. ఇక రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు వసీం జాఫర్. ముంబై కు చెందిన ఈ ప్లేయర్ మొత్తం 155 మ్యాచ్లాడి 12038 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో మరే ఇతర బ్యాట్స్‌మన్ 10వేల పరుగుల మార్కును అందుకోలేకపోయాడు. రంజీ ట్రోఫీలో బౌలింగ్ విభాగంలో టాప్ వికెట్ టేకర్‌గా రజిందర్ గోయెల్ ఉన్నాడు. పాటియాలా తరపున అరంగేట్రం చేసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ మొత్తంగా 640 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: క్రొయేషియా బలం ఆ నలుగురే.. సైలెంట్ అనిపించే వయొలెంట్ కిల్లర్స్
Comments
Please login to add a commentAdd a comment