
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నూతన కార్యవర్గం కొలువు దీరింది. హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడిగా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ అభ్యర్థి జగన్ మోహన్‌రావు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ఎన్నికయ్యారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి అమర్నాథ్‌పై ఒక్క ఓట్ తేడాతో జగన్ మోహన్‌రావు విజయం సాధించారు. అమర్నాథ్‌కు 62 ఓట్లు పడగా.. జగన్ మోహన్‌రావు 63 ఓట్లు సొంతం చేసుకున్నారు.
అదే విధంగా హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా దళ్జిత్ సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), సెక్రటరీగా దేవరాజు (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్), జాయింట్ సెక్రటరీగా బసవరాజు (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), కోశాధికారిగా సీజే శ్రీనివాసరావు, (యునైటెడ్ మెంబర్స్ ప్యానెల్), కౌన్సిలర్‌గా సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్) గెలుపొందారు.
కాగా మొత్తం 6 పదవుల కోసం బరిలో 24 మంది పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 173 ఓట్లకు గాను 169 ఓట్లు పోలయ్యాయి. మాజీ క్రికెటర్లు వీవియస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు, మిథాలిరాజ్,స్రవంతి సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా హెచ్‌సీఏ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ వ్యవహరించారు.