
సిరాజ్, తన్మయ్‌లకు సన్మానం
వర్ధమాన క్రికెటర్లు మొహమ్మద్ సిరాజ్, తన్మయ్ అగర్వాల్, రాహుల్‌సింగ్‌లకు గురువారం ఘన సన్మానం జరిగింది.
సాక్షి, హైదరాబాద్: వర్ధమాన క్రికెటర్లు మొహమ్మద్ సిరాజ్, తన్మయ్ అగర్వాల్, రాహుల్‌సింగ్‌లకు గురువారం ఘన సన్మానం జరిగింది. బషీర్‌బాగ్‌లోని ప్రెస్ క్లబ్‌లో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీరిని సన్మానించింది. దేశవాళీ టోర్నీల్లో నగరానికి చెందిన సిరాజ్, తన్మయ్, రాహుల్ సింగ్‌లు నిలకడగా రాణిస్తున్నారు. సిరాజ్ ఇటీవలే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ వి. హనుమంతరావు ఆటగాళ్లకు శాలువాను కప్పి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమానికి రాహుల్ సింగ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన తండ్రి జ్ఞాపికను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ భారత క్రికెటర్ అర్షద్ ఆయూబ్, హెచ్‌సీఏ కార్యదర్శి జాన్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.