
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో కొనసాగుతున్న ఆధిపత్య పోరు కారణంగా రోజూవారీ క్రికెట్ వ్యవహారాలకు అంతరాయం కలిగించవద్దని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే ఇకపై ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి చెక్‌లపై అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్, కార్యదర్శి విజయానంద్ సంయుక్తంగా సంతకాలు చేయాలని ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన బెంచ్ చెక్‌ల విషయంలో ఈ తాత్కాలిక ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను దీపావళి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment