కౌశిక్‌ రెడ్డి అద్భుత సెంచరీ | Hyderabad Cricket Association A2 Division 2 Days League | Sakshi
Sakshi News home page

కౌశిక్‌ రెడ్డి అద్భుత సెంచరీ

Published Sat, Jul 20 2019 2:48 PM | Last Updated on Sat, Jul 20 2019 2:48 PM

Hyderabad Cricket Association A2 Division 2 Days League - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎ–2 డివిజన్‌ రెండు రోజుల క్రికెట్‌ లీగ్‌లో గెలాక్సీ సీసీ బ్యాట్స్‌మన్‌ కౌశిక్‌ రెడ్డి (123 బంతుల్లో 102 నాటౌట్‌; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. కౌశిక్‌ శతకంతో చెలరేగడంతో జిందా తిలిస్మాత్‌ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో గెలాక్సీ సీసీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 177 పరుగుల లక్ష్యఛేదనకు శుక్రవారం బరిలో దిగిన గెలాక్సీ సీసీ 39.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కౌశిక్‌తో పాటు శశాంక్‌ (38 నాటౌట్‌) రాణించాడు. అంతకుముందు జిందా తిలిస్మాత్‌ జట్టు  50.3 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. గెలాక్సీ బౌలర్‌ షౌనక్‌ కులకర్ణి 8 వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చాడు.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు 

  •      ఆదిలాబాద్‌ జిల్లా: 265 (ప్రదీప్‌ 90 నాటౌట్‌; హరీశ్‌ ఠాకూర్‌ 7/85), సికింద్రాబాద్‌ నవాబ్స్‌: 35 (రాకేశ్‌ 4/7, ప్రదీప్‌ 4/13, అశ్విక్‌ 2/5). 
  •      దక్కన్‌ వాండరర్స్‌: 184 (56.4 ఓవర్లలో), హైదరాబాద్‌ బ్లూస్‌: 39/2 (9 ఓవర్లలో). 
  •      మెగాసిటీ: 269 (76.5 ఓవర్లలో), సీసీఓబీ: 154/8 (బషీరుద్దీన్‌ 47; టి. గౌరవ్‌ 6/43). 
  •      కొసరాజు: 365 (75 ఓవర్లలో), సైబర్‌టెక్‌: 122 (కె. శ్రౌత్‌ రావు 40; రంజిత్‌ కుమార్‌ 6/22). 
  •      మహమూద్‌: 185 (69.1 ఓవర్లలో), కరీంనగర్‌ జిల్లా: 134 (సాయితేజ 32; ముబస్సిర్‌ అహ్మద్‌ 3/21). 
  •      ఆక్స్‌ఫర్డ్‌ బ్లూస్‌: 391 (87.4 ఓవర్లలో), అగర్వాల్‌ సీనియర్‌: 209 (పి. వీరేందర్‌ 61 నాటౌట్‌; సచిత్‌ నాయుడు 5/69). 
  •      మాంచెస్టర్‌: 158 (55.5 ఓవర్లలో), గ్రీన్‌ టర్ఫ్‌: 132 (వి. పరిమళ్‌ 3/40, సాయి ప్రతీక్‌ 3/11). 
  •      వరంగల్‌ జిల్లా: 459 (89.2 ఓవర్లలో), ఎలిగెంట్‌ సీసీ: 155 (సయ్యద్‌ అఫ్జల్‌ 78; ఎన్‌. అజయ్‌ 5/51, పవన్‌ రెడ్డి 5/66).

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement