Two days league
-
సహస్రారెడ్డి సెంచరీ వృథా
సాక్షి, హైదరాబాద్: విశాక బ్యాట్స్‌మన్ సహస్రా రెడ్డి (147 బంతుల్లో 103; 17 ఫోర్లు) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ సహచరులు విఫలమవ్వడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. బౌలింగ్‌లో నదీమ్ (5/57) చెలరేగడంతో హెచ్‌సీఏ ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో భాగంగా రోహిత్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో విశాక సీసీ 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆట రెండోరోజు మంగళవారం 214 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన విశాక సీసీ 59.1 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. సహస్రా రెడ్డి కీలక సెంచరీ సాధించగా, సాయి విహారి (41; 9 ఫోర్లు) రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడంతో విశాక జట్టు పరాజయం పాలైంది. అంతకుముందు రోహిత్ ఎలెవన్ 61.1 ఓవర్లలో 213 పరుగులు చేసింది. అపెక్స్ సీసీతో మంగళవారం మొదలైన మరో మ్యాచ్‌లో విజయ్ హనుమాన్ సీసీ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విజయ్ హనుమాన్ 51.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. రాజశేఖర్ (62; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. సాహిల్ (37) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాహుల్ రెడ్డి 4 వికెట్లు, వినీత్ 5 వికెట్లతో ప్రత్యరి్థని కట్టడి చేశారు. సలీమ్ పాషా హ్యాట్రిక్.. స్పోర్టివ్ సీసీ విజయం హెచ్‌సీఏ ఎ–2 డివిజన్ రెండు రోజుల లీగ్‌లో స్పోర్టివ్ సీసీ బౌలర్ సలీమ్ పాషా (6/58) అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. ‘హ్యాట్రిక్’తో సహా ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో మంగళవారం హైదరాబాద్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పోర్టివ్ సీసీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టైటాన్స్ 69 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఎస్. రోహిత్ రెడ్డి (76; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, జైనాథ్ మాన్సింగ్ (49; 9 ఫోర్లు) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో సలీమ్ పాషా 6 వికెట్లతో చెలరేగాడు. అనంతరం స్పోరి్టవ్ సీసీ 47.1 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు చేసి గెలుపొందింది. స్వామి నాయుడు (34) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో సాకేత్ 3... నరేందర్ గౌడ్, రోహిత్ రెడ్డి చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
హర్షవర్ధన్ 201 నాటౌట్
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో బ్రదర్స్ ఎలెవెన్ జట్టు బ్యాట్స్‌మన్ హర్షవర్ధన్ సింగ్ దుమ్మురేపాడు. మంగళవారం ఉస్మానియాతో మొదలైన ఈ మ్యాచ్‌లో అతడు ఏకంగా ద్విశతకం (252 బంతుల్లో 201 నాటౌట్; 27 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కదంతొక్కాడు. దీంతో బ్రదర్స్ ఎలెవెన్ జట్టు 90 ఓవర్లలో 9 వికెట్లకు 409 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ సీజన్లో హర్షవర్ధన్ నిలకడగా రాణిస్తున్నాడు. అతని ఖాతాలో మూడు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ చేరాయి. గత మ్యాచ్‌ల్లో పీకేఎంసీసీపై (111), జాన్సన్ స్కూల్ (102 నాటౌట్), హైదరాబాద్ టైటాన్స్ (101 నాటౌట్) అతను సెంచరీలు సాధించాడు. ఓపెనర్ మణికంఠ (89 బంతుల్లో 92; 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకాన్ని చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. -
కౌశిక్ రెడ్డి అద్భుత సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో గెలాక్సీ సీసీ బ్యాట్స్‌మన్ కౌశిక్ రెడ్డి (123 బంతుల్లో 102 నాటౌట్; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. కౌశిక్ శతకంతో చెలరేగడంతో జిందా తిలిస్మాత్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో గెలాక్సీ సీసీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 177 పరుగుల లక్ష్యఛేదనకు శుక్రవారం బరిలో దిగిన గెలాక్సీ సీసీ 39.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కౌశిక్‌తో పాటు శశాంక్ (38 నాటౌట్) రాణించాడు. అంతకుముందు జిందా తిలిస్మాత్ జట్టు 50.3 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. గెలాక్సీ బౌలర్ షౌనక్ కులకర్ణి 8 వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ఆదిలాబాద్ జిల్లా: 265 (ప్రదీప్ 90 నాటౌట్; హరీశ్ ఠాకూర్ 7/85), సికింద్రాబాద్ నవాబ్స్: 35 (రాకేశ్ 4/7, ప్రదీప్ 4/13, అశ్విక్ 2/5). దక్కన్ వాండరర్స్: 184 (56.4 ఓవర్లలో), హైదరాబాద్ బ్లూస్: 39/2 (9 ఓవర్లలో). మెగాసిటీ: 269 (76.5 ఓవర్లలో), సీసీఓబీ: 154/8 (బషీరుద్దీన్ 47; టి. గౌరవ్ 6/43). కొసరాజు: 365 (75 ఓవర్లలో), సైబర్‌టెక్: 122 (కె. శ్రౌత్ రావు 40; రంజిత్ కుమార్ 6/22). మహమూద్: 185 (69.1 ఓవర్లలో), కరీంనగర్ జిల్లా: 134 (సాయితేజ 32; ముబస్సిర్ అహ్మద్ 3/21). ఆక్స్ఫర్డ్ బ్లూస్: 391 (87.4 ఓవర్లలో), అగర్వాల్ సీనియర్: 209 (పి. వీరేందర్ 61 నాటౌట్; సచిత్ నాయుడు 5/69). మాంచెస్టర్: 158 (55.5 ఓవర్లలో), గ్రీన్ టర్ఫ్: 132 (వి. పరిమళ్ 3/40, సాయి ప్రతీక్ 3/11). వరంగల్ జిల్లా: 459 (89.2 ఓవర్లలో), ఎలిగెంట్ సీసీ: 155 (సయ్యద్ అఫ్జల్ 78; ఎన్. అజయ్ 5/51, పవన్ రెడ్డి 5/66). -
చెలరేగిన సూర్య విక్రమాదిత్య
జింఖానా, న్యూస్‌లైన్: అవర్స్ సీసీ జట్టు బౌలర్ సూర్య విక్రమాదిత్య 6 వికెట్లు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఎ- డివిజన్ రెండు రోజుల లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో అవ ర్స్ సీసీ జట్టు బౌలర్ సూర్య... పాషా బీడి జట్టు బ్యాటింగ్‌ను కట్టడి చేయడంతో పాషా జట్టు 104 పరుగుల వద్ద ఆలౌటైంది. పాషా బీడి జట్టు ఆటగాళ్లు ఫరాన్ (31), ముజ్తబా (30) మినహా తక్కినవారు రాణించలేక పోయారు. మరో మ్యాచ్‌లో జిందా సీసీ జట్టు బ్యాట్స్‌మెన్ ఫరాజ్ నవీద్ 159 , హుస్సేన్ 62, అజహర్ 57 పరుగులతో కదం తొక్కడంతో జట్టు 395 పరుగులు సాధించింది. హెచ్‌బీసీసీ జట్టు బౌలర్ ఒమర్ ఖాన్ 8 వికెట్లు తీసి చెలరేగినప్పటికీ జిందా జట్టు భారీ స్కోరును అడ్డుకోలేకపోయాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు బాలాజీ కోల్ట్స్: 294 (నవదీప్ సింగ్ 130, అమిత్ యాదవ్ 38, భాస్కర్ 34; తక్విల్లా 6/92), పీ అండ్ టీతో మ్యాచ్ ఉస్మానియా: 404 (సిద్ధాంత్ 119, రామ్ ప్రసాద్ 76, సృజన్ 32, దినేష్ 31; శ్రీరామ్ 3/85), రాజు సీసీతో మ్యాచ్ సుల్తాన్ షాహీ: 386 (ప్రసాద్ 56, మహేష్ కుమార్ 60, సాయికుమార్ 65, యోగి 95; చంద్రకాంత్ 5/113), హైదరాబాద్ టైటాన్స్: 55/5.