భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ మూడో టీ20 లైవ్‌ అప్‌డేట్స్‌ | India Vs Bangladesh 3rd T20 Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ మూడో టీ20 లైవ్‌ అప్‌డేట్స్‌

సంజూ శాంసన్‌ విధ్వంసకర శతకం.. టీమిండియా అతి భారీ స్కోర్‌

హైదరాబాద్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా భారత్‌ అంతర్జాతీయ టీ20 చరిత్రలో రెండో భారీ స్కోర్‌ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.

సంజూ శాంసన్‌ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో, సూర్యకుమార్‌ యాదవ్‌ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్‌ సెంచరీతో చెలరేగిపోయారు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్‌ పరాగ్‌ (13 బంతుల్లో 34; ఫోర్‌, 4 సిక్సర్లు) కూడా తలో చేయి వేయడంతో భారత్‌ రికార్డు స్కోర్‌ సాధించింది.

2024-10-12 21:00:33

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

206 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. మహ్మదుల్లా బౌలింగ్‌లో రిషద్‌ హొసేన్‌కు క్యాచ్‌ ఇచ్చి సూర్యకుమార్‌ యాదవ్‌ (75) ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 252/3గా ఉంది. హార్దిక్‌ పాండ్యా (23), రియాన్‌ పరాగ్‌ (25) క్రీజ్‌లో ఉన్నారు.

2024-10-12 20:38:00

సంజూ ఔట్‌

47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేసిన అనంతరం సంజూ శాంసన్‌ ఔటయ్యాడు. 13.4 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 196/2గా ఉంది. క్రీజ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (32 బంతుల్లో 67;6 ఫోర్లు, 5 సిక్సర్లు), రియాన్‌ పరాగ్‌ ఉన్నారు.

2024-10-12 20:20:45

40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన శాంసన్‌

శాంసన్‌ 40 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో శాంసన్‌కు ఇది తొలి సెంచరీ.

2024-10-12 20:12:04

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న స్కై

సూర్యకుమార్‌ 23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

2024-10-12 20:01:02

వరుసగా ఐదు సిక్సర్లు బాదిన సంజూ

రిషద్‌ హొసేన్‌ వేసిన 10వ ఓవర్‌లో సంజూ శాంసన్‌ వరుసగా ఐదు సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతం సంజూ 35 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో సూర్యకుమార్‌ కూడా చెలరేగి ఆడుతున్నాడు. స్కై హాఫ్‌ సెంచరీకి (21 బంతుల్లో 48; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేరువయ్యాడు. 10 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 152/1గా ఉంది.

2024-10-12 19:59:20

22 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్‌

ఈ మ్యాచ్‌లో ఆది నుంచి కాన్ఫిడెంట్‌గా ఆడుతున్న సంజూ శాంసన్‌ కేవలం 22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా చెలరేగి ఆడుతున్నాడు. స్కై 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. 7 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 98/1గా ఉంది.
 

2024-10-12 19:39:07

చెలరేగి ఆడుతున్న సంజూ శాంసన్‌

ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ చెలరేగి ఆడుతున్నాడు. కేవలం 15 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర​్‌ సాయంతో 31 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. 4 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 47/1గా ఉంది. సంజూతో పాటు స్కై (11) క్రీజ్‌లో ఉన్నాడు.

2024-10-12 19:24:31

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

23 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. తంజిమ్‌ హసన్‌ బౌలింగ్‌లో మెహిది హసన్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ (4) ఔటయ్యాడు.

2024-10-12 19:12:47

వరుసగా నాలుగు ఫోర్లు కొట్టిన శాంసన్‌

తస్కిన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌ వరుసగా నాలుగు ఫోర్లు కొట్టాడు. 

2024-10-12 19:12:47

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

హైదరాబాద్‌ వేదికగా బంగ్లాదేశ్‌ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్‌ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

తుది జట్లు..

భారత్: సంజు శాంసన్(వికెట్‌కీపర్‌), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), నితీష్ కుమార్‌ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, మయాంక్ యాదవ్

బంగ్లాదేశ్: పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్(వికెట్‌కీపర్‌), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్‌), తంజిద్‌ హసన్‌, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, రిషద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తంజిమ్ హసన్ సకీబ్

2024-10-12 18:43:02
Advertisement
 
Advertisement
Advertisement