హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా జూలు విధిల్చింది. ఈ ఆఖరి టీ20లో బంగ్లాను 133 పరుగుల తేడాతో భారత జట్టు చిత్తు చేసింది. దీంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్న 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమితమైంది. ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన భారత జట్టు పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.
భారత్ సాధించిన రికార్డులు ఇవే..
➔అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ఈ రికార్డు సాధించిన జాబితాలో నేపాల్ ఉంది. ఆసియా క్రీడలు-2023లో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 314 పరుగులు చేసింది. కాగా ఈ 297 పరుగులే భారత్‌కు టీ20ల్లో అత్యధిక స్కోర్ కావడం విశేషం. అంతకుముందు 260 పరుగులు భారత అత్యధిక స్కోర్‌గా ఉండేది.
➔ఒక టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు నమోదు చేసిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు సాధించింది. బంగ్లాతో మ్యాచ్‌లో భారత్ ఏకంగా 47 బౌండరీలు బాదింది. అందులో22 సిక్స్‌లు, 25 ఫోర్లు ఉన్నాయి. ఇంతకుముందు ఈ రికార్డు చెక్ రిపబ్లిక్(43 పేరిట ఉండేది.
➔వరల్డ్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 200కు పైగా పరుగులు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటివరకు భారత జట్టు టీ20ల్లో 37 సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ జట్టు సొమర్‌సెట్ పేరిట ఉండేది. సొమర్‌సెట్ 36 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది. తాజా మ్యాచ్‌తో సొమర్‌సెట్ ఆల్‌టైమ్ రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది.
➔టీ20ల్లో వేగంగా 100 పరుగుల మార్క్ అందుకున్న జట్టు కూడా టీమిండియానే. ఈ మ్యాచ్‌లో భారత్ 7.1 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద దాటింది. ఇప్పటివరకు ఈ రికార్డు 7.6 ఓవర్లతో భారత్ పేరిటే ఉండేది.
➔ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌ల బాదిన జాబితాలో భారత్ మూడో స్ధానంలో నిలిచింది. బంగ్లాతో మ్యాచ్‌లో భారత్ 22 సిక్స్‌లు కొట్టింది.
చదవండి: IND vs BAN: చెలరేగిన సంజూ, సూర్య.. బంగ్లాను చిత్తు చేసిన భారత్
Comments
Please login to add a commentAdd a comment