David Warner: మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న 2023 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నూతన కెప్టెన్‌ను ఎంపిక చేసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది చివర్లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం బెడ్ రెస్ట్‌లో ఉన్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ ఎంపిక అనివార్యమైంది. పంత్ గైర్హాజరీలో డీసీ సారధ్య బాధ్యతలను ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మోయనున్నట్లు డీసీ యాజమాన్యం కన్ఫర్మ్ చేసింది.
ఈ విషయాన్ని డీసీ మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. మేనేజ్‌మెంట్‌లోని ఓ కీలక వ్యక్తి ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు తెలిపారు. కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను ఎంపిక చేసుకున్న యాజమాన్యం.. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) అక్షర్ పటేల్‌ను ఎంచుకున్నట్లు సదరు వ్యక్తి కన్ఫర్మ్ చేశాడు.
స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో అక్షర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో అతనికి ఈ పదవి దక్కినట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ రేసులో వార్నర్‌తో పాటు రోవమన్ పావెల్, మనీశ్ పాండే, మిచెల్ మార్ష్‌ల పేర్లు వినిపించినప్పటికీ.. యాజమాన్యం అనుభవజ్ఞుడైన డేవిడ్ వార్నర్‌పై నమ్మకముంచింది. వార్నర్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రిపల్ పటేల్, మనీశ్ పాండే, రిలీ రొస్సో, రోవమన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా, యశ్ ధుల్, ఫిల్ సాల్ట్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, అమన్ హకీం ఖాన్, లలిత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, అన్రిచ్ నోర్జే, ముస్తాఫిజుర్ రెహ్మన్, లుంగి ఎంగిడి, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, విక్కీ ఓస్వాల్
Comments
Please login to add a commentAdd a comment