టీమిండియా టీ20 పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అద్బుతమైన విజయాలు సాధించాడు. యువ ఆటగాళ్లతో కూడిన జట్లతోనే శ్రీలంక పర్యటనలో పొట్టి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఈ ముంబై బ్యాటర్.. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌పై 3-0తో వైట్‌వాష్ చేసి సత్తా చాటాడు.
సఫారీ పిచ్‌లపై అంత ఈజీ కాదు
అయితే, సౌతాఫ్రికా టూర్ రూపంలో సూర్యకు అసలు సిసలు సవాలు ఎదురుకానుంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌లను క్లీన్‌స్వీప్ చేసినంత సులువుగా సౌతాఫ్రికాను పడగొట్టడం సాధ్యం కాదు. సొంత పిచ్‌లపై చెలరేగే సఫారీ బౌలర్లను ఎదుర్కోవడం కత్తిమీద సాములాంటిదే.
పైగా టీ20 ప్రపంచకప్-2024లో స్వల్ప తేడాతో టీమిండియా చేతిలో ఓడి తొలి టైటిల్ గెలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది సౌతాఫ్రికా. అందుకు ఈ సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. అలాంటపుడు యువ జట్టుతో ప్రొటిస్ టీమ్‌ను ఎదుర్కోవడం సూర్యకు బిగ్ చాలెంజ్ అనడంలో సందేహం లేదు.
తిలక్ వర్మ పునరాగమనం
ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లలో నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ యాదవ్ సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లే జట్టులో లేరు. వీరిలో నితీశ్, సుందర్ ఆస్ట్రేలియా పర్యటనతో బిజీ కానున్నారు.
ఈ క్రమంలో 11 నెలల తర్వాత హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ పునరాగమనం ఖాయం కాగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్ అరంగేట్రం కూడా ఫిక్సయినట్లు తెలుస్తోంది.
ఈసారి ఛాన్స్ పక్కా
ఈ ఇద్దరితో పాటు.. సీనియర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సైతం సౌతాఫ్రికాతో తొలి టీ20లో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన అక్షర్ ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టులు ఆడిన జట్లలో సభ్యుడే. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. అయితే, సౌతాఫ్రికా సిరీస్‌లో అక్షర్‌ను ఆడించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రొటిస్‌తో తొలి టీ20లో టీమిండియా ముగ్గురు పేసర్లను తుదిజట్టులో ఆడించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే యశ్ దయాళ్ ఎంట్రీ ఖాయమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇటీవలి రిటెన్షన్స్‌లో భాగంగా ఆర్సీబీ యశ్‌ను రూ. 5 కోట్లకు అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు
సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాక్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాళ్.
సౌతాఫ్రికాతో తొలి టీ20- భారత తుదిజట్టు(అంచనా)
సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, యశ్ దయాళ్, ఆవేశ్ ఖాన్.
చదవండి: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్.. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment