బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలిసారి వంద పరుగుల భాగస్వామ్యం నమోదైంది. వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంలో ఇరుజట్ల బ్యాటర్లు విఫలమైన చోట టీమిండియా ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లు చేసి చూపించారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అక్షర్, అశ్విన్‌లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని అందుకున్నారు.
139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లు ఆదుకున్నారు. ఎనిమిదో వికెట్‌కు ఇద్దరు కలిసి 114 పరుగులు జోడించారు. తద్వారా సిరీస్‌లో తొలి వంద పరుగుల భాగస్వామ్యం అందుకున్న జంటగా నిలిచారు. అంతేకాదు ఈ జంట ఒక అరుదైన రికార్డు కూడా తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరపున ఎనిమిదో స్థానంలో సెంచరీ పరుగుల భాగస్వామ్యం అందుకున్న నాలుగో జంటగా అశ్విన్, అక్షర్ నిలిచారు. ఇక తొలి టెస్టులో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు వంద పరుగుల పార్ట్‌నర్‌షిప్‌కు దగ్గరి వరకు వచ్చి ఆగిపోయారు. ఆ మ్యాచ్‌లో ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్‌కు 88 పరుగులు జోడించారు.
ఇక రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 262 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాకు ఒక్క పరుగు ఆధిక్యం లభించింది. ఒక దశలో 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన టీమిండియాను అక్షర్ పటేల్, అశ్విన్‌లు ఆదుకున్నారు. ఎనిమిదో వికెట్‌కు 114 పరుగులు జోడించి టీమిండియా పరువును కాపాడారు. అక్షర్ పటేల్ 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కోహ్లి 44, అశ్విన్ 37 పరగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియోన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: సిక్సర్‌తో ఫిఫ్టీ.. పూర్తిస్థాయి బ్యాటర్‌గా మారిపోయాడు
Comments
Please login to add a commentAdd a comment