నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా.. ఆస్ట్రేలియాపై పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. జడేజా (66 పరుగులు), అక్షర్ పటేల్(52 పరుగులు)లు క్రీజులో ఉన్నారు. 144 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా మూడోరోజు ఆటలో 200 పరుగుల ఆధిక్యం సాధిస్తే మ్యాచ్‌పై పట్టు సాధించినట్లే. అంతకముందు రోహిత్ శర్మ అద్భుత శతకంతో అలరించాడు.
రెండోరోజు ముగిసిన తర్వాత అక్షర్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియా మీడియాకు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. నాగ్‌పూర్ పిచ్‌పై ఆసీస్ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించడంపై స్పందించిన అక్షర్.. '' మేం రేపు పొద్దున బ్యాటింగ్ చేసేవరకు పిచ్ మాకు అనుకూలంగానే ఉంటుంది.. ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చేసరికి ఏదో ఒక దారి వెతుక్కుంటాం'' అని నవ్వుతూ పేర్కొన్నాడు.
ఆ తర్వాత అక్షర్ మాట్లాడుతూ..'' ఇక మ్యాచ్‌లో అనవసర ఒత్తిడికి గురి కాకుండా స్ట్రైక్ రొటేషన్ మీద ఫోకస్ చేయమని జడేజా సూచనలు ఇచ్చాడు. అదే పాటించాను పరుగులు రాబట్టాను. ఇక ఏడాది నుంచి నా బ్యాటింగ్‌లో మార్పు వచ్చింది. బ్యాటింగ్‌లో టెక్నిక్ పరంగా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. బ్రేక్ దొరికిన సమయంలో దానిని మెరుగుపరుచుకున్నా. కోచింగ్ స్టాఫ్ వద్ద మరిన్ని మెళుకువలు నేర్చుకొని ఎబిలిటీ పెంచుకున్నా. ఇది కొనసాగించడానికి ప్రయత్నిస్తా'' అంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment