టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వరల్డ్‌కప్ 2023కు ఆఖరి నిమిషంలో దూరమైన సంగతి తెలిసిందే. గాయం కారణంగా అక్షర్ ఈ మెగా టోర్నీకి అందుబాటులో లేడని బీసీసీఐ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే విధంగా అతడి స్ధానంలో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
అయితే వన్డే వరల్డ్ కప్ నుంచి తనను తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై అక్షర్ పటేల్ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అతడి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. " కామర్స్ కు బదులుగా సైన్స్ సబ్జెక్స్ తీసుకుని ఉండాల్సి ఉంది. మంచి పీఆర్ ను నియమించుకోవాల్సిందని" తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అక్షర్ రాసుకొచ్చాడు.
అదే విధంగా మరో స్టోరీలో ఓ అస్తి పంజరం కత్తెరతో గుండెను కోసేస్తున్నట్లు ఉన్న ఎనిమిషేన్ ఫోటోను అక్షర్ షేర్ చేశాడు. అయితే వెంటనే తన చేసిన పోస్టులను అక్షర్ డిలీట్ చేశాడు. కానీ నెటిజన్లు అప్పటికే స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా అతడి పోస్టులను చూస్తే.. గాయం చిన్నదే అయినప్పటికీ కావాలనే తనను పక్కన పెట్టినట్లు అక్షర్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇది ఇలా ఉండగా.. "అక్షర్ ఇటువంటి పోస్టులు ఏమీ చేయలేదని, అవన్నీ ఫేక్ స్క్రీన్ షాట్లు" అని మరి కొంత మంది సోషల్ మీడియాలో కామెట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై అక్షర్ పటేల్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment