అండర్ 19 వరల్డ్‌కప్-2024లో టీమిండియా ఫైనల్ చేరడంలో స్పిన్నర్ సౌమీ పాండేది కీలక పాత్ర. ఈ టోర్నీ ఆసాంతం 19 ఏళ్ల సౌమీ పాండే అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన పాండే 17 వికెట్లు పడగొట్టి.. మూడో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగిస్తున్నాడు.
ఆస్ట్రేలియాతో జరగనున్న ఫైనల్‌లో సౌమీ మరో మూడు వికెట్లు పడగొడితే ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. అయితే ప్రతీమ్యాచ్‌లోనూ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సౌమీ పాండేను కొంతమంది టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పోలుస్తున్నారు.
భారత క్రికెట్‌కు మరో జడేజా దొరికేశాడని, జూనియర్ జడ్డూ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన సౌమీ పాండే తండ్రి కృష్ణ కుమార్ పాండే స్పందించాడు. దయ చేసి తన కొడుకును జడేజాతో పోల్చవద్దని కృష్ణ కుమార్ విజ్ఞప్తి చేశాడు.
జడేజాతో పోల్చవద్దు..
"కొంతమంది అభిమానులు సౌమీ పాండేను రవీంద్ర జడేతో పోలుస్తున్నారు. అయితే నా కొడుకును జడేజాతో పోల్చడం సరికాదు. సౌమీ ఇంకా నేర్చుకునే స్ధాయిలో ఉన్నాడు. జడేజా ఇప్పటికే తన పదిహేనేళ్ల క్రికెట్ కెరీర్‌ను పూర్తి చేసుకున్నాడు. అతడు తన కెరీర్‌లో అత్యుత్తమ స్ధాయిలో ఉన్నాడు.
అతడు ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాడు. జడ్డూ ఈ స్ధాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు. భారత్‌కు అతడు ఎన్నో అద్బుత విజయాలను అందిచాడు. సౌమీ ఇంకా మొదటి మెట్టు వద్దే ఉన్నాడు. దయచేసి ఇకనైనా సౌమీని జడేజాతో పోల్చవద్దు" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ కుమార్ పేర్కొన్నాడు.
చదవండి: ILT 20: నరాలు తెగ ఉత్కంఠ.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment