అండర్-19 ప్రపంచకప్ 2022 ను యువ భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజ్ బవా అరుదైన రికార్డును సాధించాడు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా తరపున ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా రాజ్ బవా రికార్డులెక్కాడు.
అంతకు ముందు అండర్-19 వరల్డ్‌కప్ 2006 ఫైనల్లో పాకిస్తాన్ బౌలర్ అన్వర్ అలీ ఐదు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఐసీసీ ఈవెంట్‌లో 150కు పైగా పరుగులు, ఐదు వికెట్లు తీసిన భారత ఎలైట్ లిస్ట్‌లో కపిల్ దేవ్‌తో పాటు బావా కూడా చేరాడు. 1983 ప్రపంచకప్‌లో కపిల్ దేవ్ ఈ ఘనత సాధించాడు. ఇక బావా ఈ మెగా టోర్నమెంట్‌లో బ్యాట్‌తోను, బాల్‌తోను అద్భుతంగా రాణించాడు. ఉగండాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 162 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు.
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్లు..
2022లో 5/31 రాజ్ బావా
2006లో 4/8 పీయూష్ చావ్లా
2020లో 4/30 రవి బిష్ణోయ్
2022లో 4/34 రవి కుమార్
2012లో 4/54 సందీప్ శర్మ
ఐసిసి ఈవెంట్‌లో 150పైగా పరుగులుతో పాటు 5వికెట్లు పడగొట్టిన భారత ఆటగాళ్లు
కపిల్ దేవ్ 1983 వన్డే వరల్డ్‌కప్
రాజః బావా 2022 అండర్-19 వరల్డ్‌కప్
Comments
Please login to add a commentAdd a comment