టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా | Under-19 World Cup quarters : Defending champions India opt to bat vs England | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

Published Sat, Feb 22 2014 11:46 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

దుబాయ్ :  అండర్-19 ప్రపంచ కప్లో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో శనివారమిక్కడ జరుగుతున్న  క్వార్టర్ ఫైనల్స్లో యువ భారత్... ఇంగ్లండ్తో తలపడుతోంది.  లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలిచి ఊపు మీదున్న భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

ఇక టీమిండియా విషయానికి వస్తే, గ్రూప్‌-ఏలో ఆడిన మూడు మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా నిలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌ విషయానికి వస్తే, గ్రూప్‌-డీలో ఆడిన మూడు మ్యాచ్ల్లో 2 విజయాలతో 4 పాయింట్లతో గ్రూప్‌ రన్నరప్‌గా నిలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు శనివారం నాడే షార్జాలో జరుగనున్న సెకండ్‌  క్వార్టర్‌  ఫైనల్లో పాకిస్థాన్‌, శ్రీలంక తలపడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement