ప్రపంచకప్ ట్రోఫీతో కెప్టెన్ పృథ్వీ షా, కోచ్ ద్రవిడ్
సాక్షి, స్పోర్ట్స్ : అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించి కొత్త చరిత్రను సృష్టించింది యువభారత్. ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు ఆనందం వ్యక్తం చేస్తూ గెలుపు క్రెడిట్ అంతా కోచింగ్ స్టాఫ్‌దేనని అభిప్రాయపడ్డారు. ఆసీస్ కెప్టెన్ జాసన్ సంఘా మాత్రం భారత ప్రదర్శనను కొనియాడాడు. ఇక యువభారత్ సారథి పృథ్వీషా కోచ్ ద్రవిడ్‌ను ఆకాశానికెత్తాడు. ‘ది వాల్’ అంటే ఎంటో తెలిసిందని చెప్పుకొచ్చాడు.
‘ఇప్పడు నా ఫీలింగ్‌ను పంచుకోలేకపోతున్నా. గర్వంగా ఉంది. క్రెడిట్ అంతా మా కోచింగ్ స్టాఫ్‌దే. వారు గత రెండేళ్లుగా మాకు మద్దతుగా నిలిచారు. రాహుల్ సర్ లెజెండ్. ‘దీ వాల్’ అంటే ఎంటో మాకు తెలిసింది. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆ ఇద్దరు ద్రవిడ్, పరాస్ మాంబ్రేలు గొప్ప సూచనలు చేశారు. ఇవి మా విజయానికి దోహద పడ్డాయి.- పృథ్వీషా, టీమిండియా కెప్టెన్.
‘ఈ సమయంలో ఏమి మాట్లాడాలో తెలియడం లేదు. మా ఆటగాళ్లు ప్రదర్శన పట్ల గర్వంగా ఫీలవుతున్నా. పూర్తి క్రెడిట్ మాత్రం భారత్‌దే. వారు చాలా అద్భుతంగా ఆడారు. ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లకు బెస్ట్ ఆఫ్ లక్. ఈ రోజు మా ఆటగాళ్ల ప్రయత్నం అద్భుతం. కెప్టెన్‌గా ఎవరిని నిందించలేను. వారంతా 110 శాతం రాణించారు. మా కంటే భారత్ బాగా ఆడింది. ఈ రోజు వారికి లభించిన మద్దతు బాగుంది. మా ప్రదర్శన క్రెడిట్ మాత్రం కోచింగ్ స్టాఫ్‌దే. ఈ రోజు మైదానానికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు రావడం చూస్తే అద్భుతమనిపించింది.’ - జాసన్ సంఘా ఆసీస్ కెప్టెన్
‘మా జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఫీలవుతున్నా. రాహుల్ సర్ కోచ్ ఉండటమే మా అదృష్టం. కేవలం మైదానంలో మీ ఆటనే ఆడండి అని రాహుల్ సర్ చెప్పాడు. మేం అదే చేశాం. ఇక్కడి పరిస్థితులు కలిసొచ్చాయి. ఈ విజయం నాకు చాలా ఉత్సహన్నిచ్చింది. ఇదే ఊపుతో ఐపీఎల్‌లో రాణిస్తాను’.- శుభ్‌మన్ గిల్, భారత క్రికెటర్ ( మ్యాన్ ఆఫ్ ది సిరీస్).
ఇదో గొప్ప అనుభూతి. ఇక్కడి పరిస్థితులు మాకు కలిసొచ్చాయి. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా. బ్యాటింగ్‌కు అనువైన పిచ్. -మన్‌జోత్ కల్రా, మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్
‘మా గెలుపు క్రెడిట్ కోచింగ్ స్టాఫ్‌దే. ఇప్పుడు ప్రపంచంలోనే నెం1 ఫీలవుతున్నా. ఇదో గొప్ప పోటీ. భారత్ నుంచి చాలా మెసేజ్‌లు వచ్చాయి. కొన్ని కారణాలవల్ల వారందరికీ రిప్లే ఇవ్వలేకపోయా. అందరికి ధన్యావాదాలు. టోర్నీ ఆసాంతం మా బౌలర్లు అద్బుతంగా రాణించారని చెప్పగలను. ఇది సమిష్టి ప్రదర్శన’- ఇషాన్ పోరెల్, టీమిండియా స్పిన్ బౌలర్
‘ఇదో అద్భుతం. నాకు బ్యాటింగ్ రావద్దనుకున్నా. కేవలం మన్‌జోత్ సెంచరీ సాధించాలని కోరుకున్నా. ఈ మ్యాచ్‌లో గట్టి పోటీ ఎదురవుతుందని ముందే భావించా. ఇది నిజంగా గట్టి పోటే. సమిష్టిగా రాణించి విజయాన్ని సులువు చేశాం. బౌలింగ్, బ్యాటింగ్‌కు ఈ పిచ్ అనువైనది’.- రియాన్ పరాగ్, భారత ఆటగాడు.
Comments
Please login to add a commentAdd a comment