అండర్ 19 వరల్డ్‌కప్-2024 ఫైనల్ పోరుకు యువ భారత్ సిద్దమైంది. ఆదివారం బెనోని వేదికగా జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఆరోసారి ప్రపంచప్ టైటిల్‌ను ముద్దాడాలని భారత్ భావిస్తుంటే.. ఆసీస్ కూడా నాలుగోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత అసాధారణ ఫామ్‌లో ఉంది. ప్రస్తుత ఫామ్‌ను చూస్తే ఆసీస్‌ను ఓడించడం పెద్ద కష్టమేమి కాదు.
ముఖ్యంగా కెప్టెన్ ఉదయ్ సహారన్ జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ పరంగా సత్తాచాటుతున్నాడు. ఈ నేపథ్యంలో ఉదయ్ సహారన్‌పై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్‌లో సహారాన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడని అశ్విన్ కొనియాడు. ప్రోటీస్ సెమీఫైనల్లో ఉదయ్ 81 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.
"ఈ ఏడాది అండర్-19 వరల్డ్‌కప్‌లో ఉదయ్ సహారాన్ కెప్టెన్సీకి కొత్త అర్ధాన్ని చెప్పాడు. తన వ్యక్తిగత ప్రదర్శనతో పాటు జట్టును కూడా అద్బుతంగా ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే అతడు జూనియర్ వరల్డ్‌కప్‌లో చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఉదయ్ చేసిన పరుగులు చూసి నేను ఇదింతా చెప్పడం లేదు.
అతడి మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం నన్ను ఎంతగానో ఆకట్టకుంది. అతడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. అదే కూల్‌నెస్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేస్తాడు. ఇప్పటికే నేను చాలా సార్లు చెప్పాడు అతడిని చూస్తుంటే మరో రింకూ సింగ్‌లా కన్పిస్తున్నాడు. రింకూ కూడా అంతే చాలా కూల్‌గా ఉంటాడు. ఉదయ్ బ్యాటింగ్ చూస్తే మ్యాచ్ మనదే అన్నట్లు అన్పిస్తుంది. చాలా కాన్ఫిడెన్స్‌తో బ్యాటింగ్ చేస్తాడని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
Final Ready 🙌
— BCCI (@BCCI) February 10, 2024
The two captains are all set for the #U19WorldCup Final 👌👌#TeamIndia | #BoysInBlue | #INDvAUS pic.twitter.com/9I4rsYdRGZ
Comments
Please login to add a commentAdd a comment