భారత్, ఆస్ట్రేలియా మధ్య మరో కీలకపోరుకు రంగం సిద్దమైంది. అయితే ఈసారి పోరు సీనియర్ల మధ్య కాదు జూనియర్ల మధ్య. అండర్ 19 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోన్నాయి. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించిన ఆసీస్.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
అంతకముందు తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన యువ భారత్.. 9వ సారి ఫైనల్లో అడుగుపెట్టింది. అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి. ఫిబ్రవరి 11న సౌతాఫ్రికా బినోని స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
జూనియర్లు ప్రతీకారం తీర్చుకుంటారా?
కాగా గత ఏడాదికాలంలో ఐసీసీ ఈవెంట్ ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా తలపడడం ఇది ముచ్చటగా మూడో సారి. గత రెండు ఈవెంట్ (డబ్ల్యూటీసీ 2023, వన్డే వరల్డ్‌కప్ 2023)ల్లోనూ ఆసీస్ గెలుపొంది.. భారత అభిమానుల ఆశలపై నీళ్లు జల్లింది. ఈ క్రమంలో కనీసం యువ భారత జట్టు అయినా ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని 140 కోట్ల మంది అభిమానులు భావిస్తున్నారు. మరి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా మరోసారి దాసోహం అంటుందా అన్నది ఆదివారం వరకు వేచి చూడాలి.
కంగారులపై మనదే పై చేయి..
ఇక అండర్-19 వరల్డ్‌కప్‌లో మాత్రం కంగారులపై టీమిండియాదే పై చేయి. ఈ మెగా ఈవెంట్ ఫైనల్ పోరులో భారత్-ఆస్ట్రేలియా తలపడడం ఇది మూడో సారి. 2003 అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో తొలిసారిగా ఆసీస్- టీమిండియా తలపడ్డాయి. ఈ టోర్నీలో ఆసీస్ జట్టు కెప్టెన్‌గా రికీ పాంటింగ్ వ్యవహరించగా.. భారత జట్టును సౌరవ్ గంగూలీ ముందుకు నడిపించాడు.
అయితే ఫైనల్ మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో భారత్‌ను ఆసీస్ చిత్తు చేసింది. కానీ ఆ తర్వాత టోర్నీల్లో మాత్రం భారత్ జూలు విధిల్చింది. అనంతరం మళ్లీ 9 ఏళ్ల తర్వాత 2012 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆసీస్- భారత్ అమీతుమీ తెల్చుకున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఉన్ముక్త్ చంద్ నేతృత్వంలోని భారత జట్టును ఆసీస్‌ను ఓడించి టైటిల్‌ను ముద్దాడింది. అదే విధంగా 2018 వరల్డ్‌కప్ తుదిపోరులోనూ యువ భారత్ మట్టికరిపించింది. ఈ సారి కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందని భారత అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
అద్భుత ఫామ్‌లో భారత్..
కాగా ప్రస్తుతం భారత జట్టు ఫామ్‌ను చూస్తుంటే ఆసీస్‌ను ఓడించి మరోసారి టైటిల్‌ను ఎగరేసుకోపోయేలా కన్పిస్తోంది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైనల్స్ చేరింది. భారత కెప్టెన్ ఉదయ్ సహారాన్, ముషీర్ ఖాన్, సచిన్ దాస్ వంటి యువ సంచలనాలు అద్భుత ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిశిచ్చే అంశం.
మరోవైపు బౌలర్లలో రాజ్ లింబానీ మరోసారి చెలరేగితే ఆసీస్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. అయితే ఆసీస్‌ను మాత్రం తక్కువగా అంచనా వేయలేం. ఫైనల్ అంటే ఆసీస్‌కు పూనకాలే. పరిస్థితులు ఎలా ఉన్న ఆఖరి వరకు పోరాడడమే ఆసీస్ ప్రధాన అస్త్రం.
17 runs for 10th Wicket Partnership!
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) February 8, 2024
𝗔𝘂𝘀𝘁𝗿𝗮𝗹𝗶𝗮 in to U19WC finals 💥
U19WC Finals
1988 - PAK vs AUS
1998 - NZ vs ENG
2000 - SL vs IND
2002 - SA vs AUS
2004 - PAK vs WI
2006 - PAK vs IND
2008 - IND vs SA
2010 - AUS vs PAK
2012 - AUS vs IND
2014 - PAK vs SA
2016 - WI… pic.twitter.com/gDjUfyJEnx
Comments
Please login to add a commentAdd a comment