140 కోట్ల మంది భారతీయులకు మరోసారి నిరాశే ఎదురైంది. మళ్లీ అదే కథ.. అదే వ్యథ. అండర్-19 వరల్డ్ కప్ మొత్తం అద్భుత ఆటతీరును ప్రదర్శించిన భారత క్రికెట్ జట్టు.. ఫైనల్లో మరోసారి ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. గతేడాది వరల్డ్‌కప్‌లో సీనియర్లకు ఎదురైన పరభావానికి కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించారు.
కానీ కంగరూలు జోరు ముందు తల వంచిన జూనియర్లు.. కనీసం పోరాడకుండానే ఓటమిని అంగీకరించారు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్ పోరులో 74 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత జట్టు.. బరువెక్కిన హృదయాలతో ఇంటిముఖం పట్టింది.
మనోడో విలన్.. ఎవరీ హర్జాస్ సింగ్?
ఇక ఆసీస్ నాలుగో సారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవడంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ హర్జాస్ సింగ్‌ది కీలక పాత్ర. కీలక సమయంలో బ్యాటింగ్‌లో వచ్చిన హర్జాస్ సింగ్.. తన అద్బుతమైన ఆటతీరుతో భారత బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. ఆసీస్ 99 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో జట్టును అదుకున్నాడు.
అచతూచి ఆడుతూ హాఫ్ సెంచరీతో తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఈ టోర్నీ మొత్తం పేలవ ప్రదర్శన కనబరిచిన హర్జాస్ సింగ్ ఫైనల్‌లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లో 55 పరుగులు చేశాడు.
అయితే ఈ ఆసీస్ వరల్డ్‌కప్ హీరో భారత భారత మూలాలు కలిగిన క్రికెటర్ కావడం గమనార్హం. హర్జాస్ సింగ్ తల్లిదండ్రులది పంజాబ్ లోని చండీగడ్. హర్జాస్ తండ్రి ఇంద్రజీత్ సింగ్ స్టేట్ లెవల్ బాక్సింగ్ ఛాంపియన్ కాగా తల్లి అవిందర్ కౌర్ రాష్ట్ర స్థాయి లాంగ్ జంపర్. అయితే వారిద్దరూ హర్జాస్ పుట్టడానికి ఐదేళ్ల ముందే సిడ్నీకి వలసవెళ్లారు. అక్కడే హర్జాస్ 2005లో జన్మించాడు.
19 ఏళ్ల హర్జాస్ చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో హర్జాస్ సింగ్ తన ఎనిమిదేళ్ల వయస్సులో సిడ్నీలోని రెవ్స్‌బీ వర్కర్స్ క్రికెట్ క్లబ్‌లో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. కాగా హర్జాస్ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఉస్మాన్ ఖ్వాజా అంటే ఎంతో ఇష్టం. అతడిని ఆదర్శంగా తీసుకుని క్రికెట్ వైపు హర్జాస్ అడుగులు వేశాడు. అయితే హర్జాజ్ చివరగా 2015లో భారత్‌కు వచ్చాడు. అయితే
Comments
Please login to add a commentAdd a comment