యువరాజ్, శుభ్‌మన్ గిల్ (ఫైల్)
ముంబై : అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో రాణించడానికి భారత సీనియర్ క్రికెటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగే కారణమని యువ ఆటగాడు శుభ్‌మన్‌గిల్ అభిప్రాయపడ్డాడు. అండర్-19 ప్రపంచకప్ గెలుచుకుని స్వదేశానికి చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడాడు.
‘ఈ టోర్నీలో అద్భుతంగా రాణించానంటే ఆ ఘనత మొత్తం యువరాజ్ సింగ్‌దే.ఈ పర్యటనకు ముందు బెంగళూరు నేషనల్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాం. సిక్సర్ల కింగ్ ఒక రోజు అక్కడికి వచ్చి మాతో ముచ్చటించారు. బ్యాటింగ్‌లోని మెళుకువలు, సలహాలను తెలియజేశాడు. టోర్నీలోని మ్యాచ్ పరిస్థితుల గురించి కోన్ని సూచనలు చేశాడు. యూవీ పాజీ ఇచ్చిన ప్రేరణ ఎంతగానో మాకు సహకరించింది. ఈ మెగా టోర్నీలో నేను చాలా బాగా ఆడానంటే ఆ క్రెడిట్ మొత్తం యువరాజ్‌కే దక్కుతుంది’ అని గిల్ చెప్పుకొచ్చాడు.
సెమీస్ సెంచరీపై స్పందిస్తూ..
పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో సాధించిన సెంచరీపై స్పందిస్తూ.. ‘ నిజానికి ఆ మ్యాచ్‌లో మేం ఒత్తిడికి గురయ్యాం. ఓపెనర్ల నుంచి మాకు మంచి శుభారంభం అందినప్పటికి అనంతరం త్వరగా వికెట్లు కోల్పోయాం. అప్పడు కోచ్ రాహుల్ ద్రవిడ్ నాలో కొంత ధైర్యాన్ని నింపాడు. మ్యాచ్ చివర వరకు క్రీజులోనే ఉండలాని సూచించాడు. ఆ సమయంలో అనుకుల్ రాయ్ నుంచి కూడా మంచి మద్దతు లభించింది. కోచ్ చెప్పినట్లు ఆడి సెంచరీ సాధించనని’ పంజాబ్ ఆటగాడు చెప్పుకొచ్చాడు.
ఈ టోర్నిలో శుభ్‌మన్ మూడు అర్థ సెంచరీలు, ఒక సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో రాణించి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు. అంతేగాకుండా ఐపీఎల్-11 సీజన్ వేలంలోఈ పంజాబ్ కుర్రాడిని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 1.8 కోట్లకు సొంతం చేసుంది. ఐపీఎల్‌లో సైతం ఈ తరహా ప్రదర్శన కనబరుస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment