
భారత యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ వన్డేల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా గిల్ అకట్టుకున్నాడు. అయితే బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు తిరిగి రావడంతో గిల్‌కు భారత జట్టులో చోటు దక్కలేదు.
ఇక ఇది ఇలా ఉండగా.. వచ్చే ఏడాది ప్రపంచకప్‌కు భారత జట్టులో శుబ్‌మన్ గిల్‌కు కచ్చితంగా చోటు దక్కుతుంది అని టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. "శుబ్‌మన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గిల్ తన ఫామ్‌ను కొనసాగిస్తాడని భావిస్తున్నాను.
2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓపెనర్ల రేసులో గిల్ కచ్చితంగా ఉంటాడు. జట్టులో చోటు కోసం గిల్ చాలా కష్టపడుతున్నాడు. రాబోయే రోజుల్లో భారత జట్టుకు కీలక ఆటగాడిగా గిల్ మారుతాడు" అని పీటీఐతో యువరాజ్ పేర్కొన్నాడు.
అదే విధంగా భారత్‌లో క్రీడల అభివృద్దికి తన వంతు కృషిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అని యువీ అన్నాడు. ఇక ఇప్పటి వరకు 15 వన్డేలు ఆడిన గిల్.. 687 పరుగులు పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీతో పాటు 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: Hrishikesh Kanitkar: భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా హృషికేశ్ కనిత్కర్