న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో అదరగొట్టి ట్రోఫీని సొంత చేసుకున్న భారత కుర్రాళ్లు సోమవారం స్వదేశానికి చేరారు. వీరికి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పృథ్వీషా నేతృత్వంలోని యువ జట్టు భారత్‌కు నాలుగోటైటిల్ అందించిన విషయం తెలిసిందే. యువ క్రికెటర్లకు స్వాగతం పలికేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ముంబై అంతర్జాతీయ విమానం కిక్కిరిసిపోయింది.