శుభ్‌మన్ గిల్ (ఫైల్)
సాక్షి, స్పోర్ట్స్ : క్రికెట్‌ను ఆరాధ్యా దైవంగా భావించే భారత్‌లో క్రికెటర్‌గా ఎదగాలంటే సులవైన వ్యవహారం కాదు. దానికి ఎంతో నిబద్దత ఎన్నో రోజుల నిరీక్షణ అవసరం. అలానే ఓ రైతు బిడ్డా క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఈ రోజుల్లో కేవలం చదువులపైనే దృష్టిపెట్టాలని చెప్పే తండ్రులున్నారు. కానీ ఓ తండ్రి కొడుకు ఇష్టాన్ని గుర్తించి ప్రోత్సాహించడంతో ఆ కుర్రాడు అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో అదర గొట్టి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అతడే సూపర్ హీరో శుభమన్ గిల్. అవును శుభమన్ రైతు బిడ్డే.
బ్యాట్ పట్టింది పొలాల్లోనే..
పంజాబ్‌లోని ఫజిల్కాకు చెందని అతని తండ్రి లఖ్వింధర్ వ్యవసాయ దారుడు. శుభ్‌మన్ నాలుగేళ్లప్పుడే బ్యాట్ చేత పట్టుకోని పొలాల్లో ఆడేవాడు. కొడుకు ఇష్టంను గుర్తించిన తండ్రి తన పొలంలోని సహాయకులను బంతులు విసరమనేవాడు. ఇలా క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న శుభమన్ ఏడేళ్లు వచ్చేప్పటికే క్రికెట్‌నే కెరీర్‌గా నిశ్చయించుకున్నాడు. కోడుకు కోసం ఆ తండ్రి సొంత ఊరు, పొలాలను వదిలి కుటుంబాన్ని మోహాలీకి తరలించారు. బింద్రా స్టేడియం సమీపంలోనే అద్దె ఇళ్లు తీసుకొని శుభ్‌మన్‌కు శిక్షణ ఇప్పించారు. తాను ఇంతలా రాణించడానికి కారణం తన తండ్రేనని, ఆయన పాత్ర ఎంతో కీలకమని శుభ్‌మన్ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చాడు .
చదువు, క్రికెట్‌ను సమన్వం చేయడంలో శుభమన్ చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. రోజుకు కనీసం నాలుగు గంటలు ప్రాక్టీస్ చేసేవాడు. తినడం, జిమ్, యోగా, ప్రాక్టీస్ చేయడం, పడుకోవడమే అతని లోకం. దీంతో సరిగ్గా స్కూల్‌కు వెళ్లేవాడు కాదు. శుభ్‌మన్ ఎన్నో వయసు గ్రూప్ లీగ్‌లు ఆడాడు. అండర్-16 అంతర్ జిల్లా టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 356 పరుగులు చేశాడు. అండర్-16 జట్టులో పంజాబ్ తరుపున డబుల్ సెంచరీ బాదాడు. స్థిరత్వంతో బ్యాటింగ్ చేస్తుండటంతో అండర్-19 జట్టులో చోటు సంపాదించుకున్నాడు.
కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతిలో పడి మరింత రాటు దేలాడు. ఇంగ్లండ్‌లో జరిగిన యూత్ వన్డే టోర్నీలో మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అందుకున్నాడు. నిజానికి గత అక్టోబర్‌లోనే శుభ్‌మన్‌కు భారత్-ఏ జట్టు తరుపున న్యూజిలాండ్-ఏపై ఆడే అవకాశం వచ్చింది. కొన్ని కారణాల వల్ల ఆడలేక పోయాడు. పంజాబ్ తరుపున విజయ్ హజారే ట్రోఫీలో రాణించాడు.
అప్పుడు సచిన్.. ఇప్పుడు కోహ్లి..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన ఆరాధ్యదైవమని, క్రికెట్ చూడటం ప్రారంభించనప్పుడే మాస్టర్ లెజెండ్ క్రికెటరని ఈ సూపర్ హీరో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మాత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని అభిమానిస్తానని, తన బ్యాటింగ్ శైలి, ఒత్తిడి అధిగమించే విధానం ఎంతో ఇష్టమని తెలిపాడు. కోహ్లిని అనుసరించాడానికి ప్రయత్నిస్తున్నానని, కానీ అది చాల కష్టమని ఈ యువ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్‌లో సైతం శుభ్‌మన్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. రూ.20 లక్షల కనీస ధరైన ఈ యువ క్రికెటర్‌ను అనూహ్యంగా రూ.1.8 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. ఇదే ఊపుతో ఐపీఎల్‌లో రాణిస్తే శుభ్‌మన్ భారత జట్టులో చోటు సంపాదించుకోవడం కష్టం కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కోహ్లి సారథ్యంలో ఆడటమే నాకల
శుభ్‌మన్ మ్యాన్ ది టోర్నీ అందుకోవడంపై అతన తండ్రి లఖ్వింధర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇలానే ఫామ్ కొనసాగించి భారత్ జట్టుకు ఎంపిక కావాలని, కోహ్లి సారథ్యంలో శుభ్‌మన్ ఆడటమే తన కోరిక అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment