ICC U19 Cricket World Cup 2022: India Beat England By 4 Wickets In Final To Win 5th Title - Sakshi

Under 19 World Cup: చాంపియన్‌ యువ భారత్‌

Feb 6 2022 7:19 AM | Updated on Feb 6 2022 12:02 PM

India Beats England to Win Record Fifth ICC Under-19 World Cup - Sakshi

నార్త్‌సౌండ్‌ (అంటిగ్వా): సమష్టి ప్రదర్శనతో యువ భారత్‌ ఐదోసారి అండర్‌–19 వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన ఫైనల్లో యశ్‌ ధుల్‌ నాయకత్వంలోని భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. జేమ్స్‌ రూ (116 బంతుల్లో 95; 12 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు సాధించి గెలిచింది.

ఎడంచేతి వాటం పేస్‌ బౌలర్‌ రవి కుమార్‌ (4/34) హడలెత్తించగా... రాజ్‌ బావా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముందుగా బంతితో ఐదు వికెట్లు తీసిన రాజ్‌ బావా (5/31) ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ (54 బంతుల్లో 35; 2 ఫోర్లు) రాణించాడు. వైస్‌ కెప్టెన్, ఆంధ్ర కుర్రాడు షేక్‌ రషీద్‌ (84 బంతుల్లో 50; 6 ఫోర్లు), నిశాంత్‌ (54 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడి అర్ధ సెంచరీలు చేశారు. దినేశ్‌ (5 బంతుల్లో 13 నాటౌట్‌; 2 సిక్స్‌లు) నాటౌట్‌గా నిలిచాడు. ఐదో వికెట్‌కు నిశాంత్, రాజ్‌ 67 పరు గులు జోడించారు. ఓపెనర్‌ అంగ్‌క్రిష్‌ (0) డకౌట్‌ కాగా... హర్నూర్‌ (21; 3 ఫోర్లు), కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ (17; 1 ఫోర్‌) ఫర్వాలేదనిపించారు. అండర్‌–19 ప్రపంచకప్‌లో భారత్‌ చాంపియన్‌గా నిలువడం ఇది ఐదోసారి. భారత్‌ 2000, 2008, 2012, 2018 లలోనూ విజేతగా నిలిచింది.


 
స్కోరు వివరాలు 
ఇంగ్లండ్‌ అండర్‌–19 ఇన్నింగ్స్‌: థామస్‌ (సి) ధుల్‌ (బి) రాజ్‌ బావా 27; బెథెల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి 2; ప్రెస్ట్‌ (బి) రవి 0; జేమ్స్‌ రూ (సి) తాంబె (బి) రవి 95; లక్స్‌టన్‌ (సి) దినేశ్‌ (బి) రాజ్‌ బావా 4; బెల్‌ (సి) దినేశ్‌ (బి) రాజ్‌ బావా 0; రేహాన్‌ అహ్మద్‌ (సి) తాంబె (బి) రాజ్‌ బావా 10; హార్టన్‌ (సి) ధుల్‌ (బి) తాంబె 10; సేల్స్‌ (నాటౌట్‌) 34; అస్పిన్‌వాల్‌ (సి) దినేశ్‌ (బి) రవి 0; బైడెన్‌ (సి) దినేశ్‌ (బి) రాజ్‌ బావా 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (44.5 ఓవర్లలో ఆలౌట్‌) 189. వికెట్ల పతనం: 1–4, 2–18, 3–37, 4–47, 5–47, 6–61, 7–91, 8–184, 9–185, 10–189. బౌలింగ్‌: రాజ్‌వర్ధన్‌ 7–1–36–0, రవికుమార్‌ 9–1– 34–4, రాజ్‌ బావా 9.5– 1–31–5, నిశాంత్‌ 6–1–19–0, విక్కీ 6–0–31–0, కౌశల్‌ 5–0– 29–1, అంగ్‌క్రిష్‌ 2–0–8–0. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

భారత అండర్‌–19 ఇన్నింగ్స్‌: అంగ్‌క్రిష్‌ (సి) హార్టన్‌ (బి) బైడెన్‌ 0; హర్నూర్‌ (సి) హార్టన్‌ (బి) అస్పిన్‌వాల్‌ 21; షేక్‌ రషీద్‌ (సి) రూ (బి) సేల్స్‌ 50; యశ్‌ ధుల్‌ (సి) బెల్‌ (బి) సేల్స్‌ 17; నిశాంత్‌ (నాటౌట్‌) 50; రాజ్‌ బావా (సి) ప్రెస్ట్‌ (బి) బైడెన్‌ 35; కౌశల్‌ (సి) రేహాన్‌ (బి) అస్పిన్‌వాల్‌ 1; దినేశ్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (47.4 ఓవర్లలో ఆరు వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–0, 2–49, 3–95, 4–97, 5– 164, 6–176. బౌలింగ్‌: బైడెన్‌ 7–1–24–2, సేల్స్‌ 7.4–0–51–2, ప్రెస్ట్‌ 10–1–29–0, రేహాన్‌ 10–2–32–0, అస్పిన్‌వాల్‌ 9–0–42–2, బెథెల్‌ 4–0–17–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement