
టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అండర్-19 వరల్డ్‌కప్స్ బెస్ట్ ఎలెవెన్ టీమ్‌ను ప్రకటించాడు. ఒకప్పుడు అండర్-19 ప్రపంచకప్ ఆడి ప్రస్తుతం సూపర్‌స్టార్లుగా వెలుగొందుతున్న 11 మందిని ఎంపిక చేశాడు. అతని జట్టులో టీమిండియా నుంచి ఒకరు మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ఆ ఒక్కడు కూడా విరాట్ కోహ్లినే కావడం విశేషం. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా జట్లలో సభ్యులుగా ఉన్న రిషబ్ పంత్, జడేజాలను ఎంపికచేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
చదవండి: IND VS WI: టీమిండియాకు 1000వ వన్డే.. కోహ్లిని ఊరిస్తున్న రికార్డు
కోహ్లిని కెప్టెన్‌గా ఎంపిక చేసిన ఆకాశ్‌చోప్రా.. పాక్ కెప్టెన్ బాబర్ అజమ్.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌లను టాపార్డర్‌కు ఎంపికచేశాడు. ఇక మిడిలార్డర్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌లను ఎంచుకున్నాడు. వికెట్ కీపర్‌గా దినేష్ చండిమల్.. ఫినిషర్‌గా షిమ్రోన్ హెట్‌మైర్‌కు చోటు కల్పించాడు. స్పిన్ బౌలర్‌గా మెహదీ హసన్‌ను ఎంపిక చేసిన ఆకాశ్.. పేస్ విభాగంలో కగిసో రబాడా, క్రిస్ వోక్స్, షాహిన్ అఫ్రిదిలను ఎంచుకున్నాడు.
చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఒక సంచలనం.. కోహ్లితో ఉన్న పోలికేంటి!
ఆకాష్ చోప్రా అండర్-19 ప్రపంచకప్స్ వరల్డ్ ఎలెవెన్:
బాబర్ అజమ్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, దినేష్ చండిమాల్, ఇయాన్ మోర్గాన్, షిమ్రాన్ హెట్మెయర్, మెహిదీ హసన్, కగిసో రబడ, క్రిస్ వోక్స్, షాహిన్ అఫ్రిది.
Comments
Please login to add a commentAdd a comment