భారత కుర్రాళ్ల బోణీ | Ireland U19 Vs India U19 Live Score, 4th ODI Match, Group D of ICC Under-19 Cricket World Cup, 2016 at Dhaka | Sakshi
Sakshi News home page

భారత కుర్రాళ్ల బోణీ

Published Fri, Jan 29 2016 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

భారత కుర్రాళ్ల బోణీ

భారత కుర్రాళ్ల బోణీ

అండర్-19 ప్రపంచకప్
మిర్పూర్: అండర్-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్లు శుభారంభం చేశారు. ఐపీఎల్ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ (70 బంతుల్లో 74; 7 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (71 బంతుల్లో 62; 3 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. దీంతో గురువారం షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన వన్డేలో భారత్ 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 268 పరుగులు సాధించింది. ఆరంభంలో ఐర్లాండ్ బౌలర్ల ధాటికి భారత్ 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సర్ఫరాజ్, సుందర్ జోడి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 17.2 ఓవర్లలో 110 పరుగులు జోడించారు. రికీ భుయ్ (54 బంతుల్లో 39; 6 ఫోర్లు), జీషన్ అన్సారీ (36 బంతుల్లో 36; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. జోషువా లిటిల్, రోరీ ఆండర్స్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ఐర్లాండ్ 49.1 ఓవర్లలో 189 పరుగులకు కుప్పకూలింది.

ఐదో వికెట్‌కు మెక్‌క్లిన్‌టాక్ (86 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), టకర్ (89 బంతుల్లో 57; 6 ఫోర్లు) 113 పరుగులు జోడించినా ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ కోలుకోలేకపోయింది. రాహుల్ బాథమ్‌కు మూడు.. అవేష్ ఖాన్, లొమ్రోర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఈనెల 30న తమ తదుపరి మ్యాచ్‌లో భారత్ జట్టు న్యూజిలాండ్‌తో ఆడనుంది.

 నేపాల్ సంచలనం: గురువారం జరిగిన మరో మ్యాచ్‌లో నేపాల్ జట్టు పటిష్ట న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగులు చేసిది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 47.1 ఓవర్లలో 206 పరుగులకే ఆలౌటై 32 పరుగుల తేడాతో ఓడింది.  శ్రీలంక 196 పరుగులతో కెనడాపై.. పాకిస్తాన్ 6 వికెట్లతో అఫ్ఘాన్‌పై గెలిచాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement