
క్వీన్స్‌టౌన్: ఎదురేలేని యువ భారత్ అండర్–19 ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళుతోంది. ఉరిమే ఉత్సాహంతో నేడు బంగ్లాదేశ్‌తో జరిగే క్వార్టర్ ఫైనల్లో తలపడేందుకు సిద్ధమైంది. మూడు సార్లు ప్రపంచ కప్ చాంపియన్ అయిన భారత్ మరో టైటిల్‌పై కన్నేసింది. గత రన్నరప్ భార త్... కోచ్ ద్రవిడ్ మార్గదర్శనంలో లీగ్ దశలో వరుస విజయాలతో నాకౌట్ చేరింది. పృథ్వీ షా సేన అసాధారణ ఫామ్‌లో ఉంది. అయితే బంగ్లాను మాత్రం అంతా తేలిగ్గా తీసుకోవద్దు. గత నవంబర్‌లో ఆసియా కప్ (కౌలాలంపూర్)లో బంగ్లా చేతిలో భారత్ కంగుతింది. పృథ్వీ షా లాంటి కీలక ఆటగాళ్లు కొందరు అందులో ఆడనప్పటికీ పరాజయం పరాజయమే.
ఈ నేపథ్యంలో ఎలాంటి అలసత్వాన్ని దరిచేరకుండా కుర్రాళ్లు బరిలోకి దిగాలి. పైగా ఇరు జట్ల ఆటగాళ్లకు చెప్పుకోదగ్గ ఫస్ట్‌క్లాస్ అనుభవముంది. భారత బ్యాటింగ్‌లో పృథ్వీ షా, శుభ్‌మాన్ గిల్ రాణిస్తుండగా, బౌలింగ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అనుకుల్ రాయ్ ప్రత్యర్థుల్ని తిప్పేస్తున్నాడు. బంగ్లా జట్టులో పేసర్ హసన్ మహుద్, ఆఫ్ స్పిన్నర్ ఆఫిఫ్ హొస్సేన్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై తమ ప్రతాపం చూపుతున్నారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం తెల్లవారు జామున 2.45 గంటలకే మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment