సొంత గడ్డపై జరుగుతున్న అండర్-19 వరల్డ్‌కప్-2024లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ప్రోటీస్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో సఫారీ స్పీడ్‌స్టర్ క్వేనా మఫాకా ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 9.1 ఓవర్లు బౌలింగ్ చేసిన మఫాకా 38 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
తన అద్బుత ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు 17 ఏళ్ల మఫాకాకు వరించింది. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మఫాకా మాట్లాడుతూ.. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో మఫాకా వికెట్ పడగొట్టిన ప్రతీసారి బుమ్రా స్టైల్‌లోనే సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు.
వికెట్ తీసినప్పుడు ఏ విధంగా సెలబ్రేషన్స్ జరుపుకోవాలో ప్రపంచ కప్‌కు ముందు నా సోదరుడిని అడిగాను. అతడు నాకు తెలియదు అని సమాధనమిచ్చాడు. అందుకు బదులుగా వెంటనే నేను 'ఐ డోంట్ నో' సెలబ్రేషన్స్ జరుపుకుంటానని నవ్వుతూ అన్నాను.
అందుకే బుమ్రా సెలబ్రేషన్స్‌ను అనుకరించాలని నిర్ణయించుకున్నాను. బమ్రా కూడా వికెట్ పడగొట్టిన పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకోడు. వరల్డ్ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకడు. అయితే బుమ్రా కంటే నేను బెటర్ అనుకుంటున్నా అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాకా పేర్కొన్నాడు.
చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు!
Comments
Please login to add a commentAdd a comment