
క్వీన్స్‌టౌన్: అండర్–19 వన్డే ప్రపంచకప్‌లో యువ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. పృథ్వీ షా నాయకత్వంలోని భారత్ జట్టు సెమీస్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 131 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అన్నివిభాగాల్లో రాణించి ఘన విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌలైంది. షబ్‌మన్ గిల్(86), అభిషేక్ శర్మ(50) అర్ధసెంచరీలు సాధించారు. పృథ్వీ షా (40), దేశాయ్(34) ఫర్వాలేదనిపించారు. 266 పరుగులు లక్ష్యాన్ని బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను భారత్ బౌలర్లు వణికించారు. పదునైన బంతులతో బంగ్లా బ్యాట్స్‌మెన్లను పెవిలియన్‌కు వరుస కట్టించారు. దీంతో బంగ్లా 42.1 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్లలో నాగర్‌కోటి 3 వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ, శివమ్‌మావి రెండేసి వికెట్లు తీశారు. అనుకుల్ రాయ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment