శుభ్‌మాన్
క్వీన్స్‌టౌన్: ఏదశలోనూ ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోకుండా... నిర్లక్ష్యానికి తావివ్వకుండా... సమష్టి ప్రదర్శన కనబరిచిన యువ భారత జట్టు అండర్–19 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్లో భారత్ 131 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటవ్వగా... బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. ఈనెల 30న జరిగే రెండో సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడుతంది. 29న జరిగే తొలి సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్‌తో ఆస్ట్రేలియా ఆడుతుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కెప్టెన్ పృథ్వీ షా (54 బంతుల్లో 40; 5 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శుభ్‌మాన్ గిల్ (94 బంతుల్లో 86; 9 ఫోర్లు), హార్విక్ దేశాయ్ (34), ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ (49 బంతుల్లో 50; 6 ఫోర్లు) రాణించడంతో ఒక దశలో 215/4తో పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ... చివర్లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో 50 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా 265 పరుగులకే పరిమితమైంది. అనంతరం కష్టసాధ్యంకాని లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను భారత్ బౌలర్లు బెంబేలెత్తించారు. కమలేశ్ నాగర్‌కోటి (3/18), శివమ్ మావి (2/27), అభిషేక్ శర్మ (2/11) రాణించి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు.
Comments
Please login to add a commentAdd a comment