Zimbabwe Spinner Victor Chirwa Suspended From Bowling in International Cricket - Sakshi
Sakshi News home page

జింబాబ్వే బౌలర్‌పై ఐసీసీ సస్పెన్షన్‌ వేటు

Published Thu, Jan 20 2022 3:30 PM | Last Updated on Thu, Jan 20 2022 6:52 PM

Zimbabwe spinner Victor Chirwa suspended from bowling international cricket  - Sakshi

అండర్‌-19 జింబాబ్వే బౌలర్‌ విక్టర్‌ చిర్వాను బౌలింగ్‌ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.  అండర్‌-19 ప్రపంచకప్‌లో భాగంగా గత శనివారం పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో విక్టర్‌ చిర్వా బౌలింగ్‌ యాక్షన్‌ అనుమానాదాస్పదంగా ఉందంటూ అండర్‌-19 ఐసీసీ ప్యానెల్‌ పేర్కొంది. చిర్వా బౌలింగ్‌ యాక్షన్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని తాము పరిశీలించామని ప్యానెల్‌ అధికారులు తెలిపారు.

చదవండి: టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌..

ఐసీసీ రూల్స్‌లోని ఆర్టికల్‌ 6.7 ప్రకారం చిర్వా బౌలింగ్‌ యాక్షన్‌ అభ్యంతరకరంగా ఉండడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌ వేయకుండా అతన్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు చిర్వా సస్పెన్షన్‌ వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ప్యానెల్‌ తెలిపింది.

చదవండి: Novak Djokovic: పోతూ పోతూ నష్టం మిగిల్చాడు.. కట్టేది ఎవరు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement