నేడు అండర్-19 వరల్డ్‌కప్ క్వార్టర్‌ఫైనల్
ఫతుల్లా: గ్రూప్ దశలో వరుస విజయాలతో హోరెత్తించిన భారత జట్టు.. అండర్-19 వరల్డ్‌కప్‌లో నాకౌట్ పోరుకు సిద్ధమైంది. ఫతుల్లాలో నేడు (శనివారం) జరగనున్న మ్యాచ్‌లో నమీబియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఏ విధంగా చూసిన ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో అందరూ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌లు విజృంభిస్తే ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు ఖాయం.
ఇక బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్ బంతులకు ఎదురునిలవడం నమీబియాకు శక్తికి మించిన పనే. లోమ్రోర్, మావి, కలీల్‌లు సమయోచితంగా స్పందిస్తే భారత్‌కు తిరుగుండదు. మరోవైపు నమీబియాను తక్కువగా అంచనా వేయలేం. లీగ్ దశలో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికాను ఓడించి టోర్నీకే దూరం చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడినా.. నమీబియాకు వచ్చిన నష్టమేమీ లేదు కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతుంది.
సెమీస్‌లో బంగ్లాదేశ్
మిర్పూర్: బ్యాటింగ్‌లో రాణించిన బంగ్లాదేశ్ అండర్-19 వరల్డ్‌కప్‌లో తొలిసారి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. శుక్రవారం జరి గిన క్వార్టరఫైనల్లో 6 వికెట్ల తేడాతో నేపాల్‌పై గెలిచింది. ముందు గా నేపాల్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 211 పరుగులు చేసింది. అనంతరం బంగ్లా 48.2ఓవర్లలో 4వికెట్లకు 215 పరుగులు సాధించింది.
భారత్ X నమీబియా
Published Sat, Feb 6 2016 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM
Advertisement
Advertisement