వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ కోసం భారత జూనియర్ జట్టును మంగళవారం ప్రకటించారు.
► భారత జూనియర్ జట్టు ఎంపిక
► అండర్-19 ప్రపంచకప్
ముంబై: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ కోసం భారత జూనియర్ జట్టును మంగళవారం ప్రకటించారు. జార్ఖండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆంధ్ర క్రికెటర్ రికీభుయ్‌కు కూడా స్థానం దక్కింది. వెంకటేశ్ ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. ఈ టోర్నీ జనవరి 27 నుంచి ఫిబ్రవరి 14 వరకు బంగ్లాదేశ్‌లో జరగనుంది. గ్రూప్-డిలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నేపాల్‌లు ఉన్నాయి. జనవరి 28న మిర్పూర్‌లో జరిగే తమ తొలి మ్యాచ్‌లో భారత్... ఆసీస్‌తో; 30న కివీస్‌తో; ఫిబ్రవరి 1న నేపాల్‌తో తలపడుతుంది.
జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, అమన్‌దీప్ కారె, అనుమోల్‌ప్రీత్ సింగ్, అర్మాన్ జాఫర్, రికీ భుయ్, మయాంక్ డేగర్, జీషాన్ అన్సారి, మహిపాల్ లోమ్రోర్, అవేశ్ ఖాన్, శుభ్నమ్ మావి, కలీల్ అహ్మద్, రాహుల్ బాథమ్.