
అండర్ 19 వరల్డ్‌కప్- 2024లో భారత్ బోణీ కొట్టింది. బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో యువ భారత జట్టు విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. భారత స్పిన్నర్ల దాటికి 167 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. ముషీర్ ఖాన్ 2 వికెట్లతో సత్తాచాటాడు.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ జేమ్స్(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ఆదర్ష్ సింగ్(76) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ఉదయ్ సహ్రన్(64) హాఫ్ సెంచరీతో రాణించాడు.
బంగ్లా బౌలర్లలో మరూప్ మిరందా 5 వికెట్లతో చెలరేగాడు. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి 25న బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది.
చదవండి: #Mohammed Shami: పెళ్లి కొడుకు గెటప్‌లో షమీ.. మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా?