దుబాయ్: అండర్-19 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ యువజట్టు పైనల్‌కు చేరింది. సోమవారం ఇంగ్లండ్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. రోడ్స్ (76 నాటౌట్), హిగిన్స్ (52) రాణించారు. పాక్ జట్టు 49.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసి గెలిచింది. అమీర్ హంజా (35), సాద్ షకీల్ (45) రాణించారు. అయితే ఒక దశలో పాక్ 142 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. జాఫర్ గోహర్ (37 నాటౌట్), అమద్ భట్ (26 నాటౌట్) అద్భుతంగా ఆడి పాకిస్థాన్‌ను ఫైనల్‌కు చేర్చారు. జాఫర్ గోహర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.