అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత యువ ఆల్ రౌండర్ నిశాంత్ సింధు కరోనా బారిన పడ్డాడు. శుక్రవారం ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా సింధుకు పాజిటివ్‌గా నిర్ధారణైంది. కాగా ఇంతకుముందు కరోనా బారిన ఆరుగురు భారత యువ ఆటగాళ్లు పూర్తిగా కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న కెప్టెన్ యష్ ధుల్, షేక్ రషీద్‌తో పాటు పలువురు ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఇక శనివారం క్వార్టర్‌ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది.
కాగా లీగ్ మ్యాచ్‌ల్లో రెగ్యూలర్ కెప్టెన్ యష్ ధుల్ దూరం కావడంతో నిశాంత్ సింధు యువ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అంతే కాకుండా జట్టు విజయాల్లో కూడా కీలక పాత్ర సింధు పోషించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డిఫెండింగ్ ఛాంపియస్స్ బంగ్లాదేశ్‌పై భారత్ బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. అండర్-19 ప్రపంచకప్ 2020 ఫైనల్లో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే.
చదవండి: జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్‌పై ఐసీసీ నిషేధం
Comments
Please login to add a commentAdd a comment