కుమ్మేసిన కిషన్, రికీ భుయ్ | India U-19 warm up for World Cup with 483/5 vs Canada, win by 372 runs | Sakshi
Sakshi News home page

కుమ్మేసిన కిషన్, రికీ భుయ్

Published Sun, Jan 24 2016 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

India U-19 warm up for World Cup with 483/5 vs Canada, win by 372 runs

మిర్పూర్: అండర్-19 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత యువ జట్టు దుమ్మురేపింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (86 బంతుల్లో 138 రిటైర్డ్ అవుట్; 16 ఫోర్లు, 7 సిక్సర్లు), ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ (71 బంతుల్లో 115 రిటైర్డ్ అవుట్; 10 ఫోర్లు, 7 సిక్సర్లు)లు వీరోచిత సెంచరీలు సాధించడంతో... శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 372 పరుగుల భారీ తేడాతో కెనడాను చిత్తు చేసింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 485 పరుగులు చేసింది. తర్వాత కెనడా 31.1 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. హర్ష్ (25) టాప్ స్కోరర్. కెప్టెన్ అబ్రాష్ ఖాన్ (22)తో సహా అందరూ విఫలమయ్యారు. భారత బౌలింగ్ ధాటికి కెనడా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరేలా కనిపించలేదు. లోమ్రోర్ 3, మావి, అన్సారి చెరో రెండు వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement